టీం పిడికిలి గోడప్రతులను ఆవిష్కరించిన ఉప్పుగంటి భాస్కరరావు

మన రాష్ట్రంలో గడిచిన మూడు సంవత్సరాలలో 3000 మందికి పైగా కౌలు రైతుల ఆత్మహత్యలు చూసి చలించిన జనసేన రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆయా రైతుల వివరాలను సేకరించి వారికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందక పోవటంతో తనవంతుగా కుటుంబానికి ఒక లక్ష రూపాయలు స్వయంగా అందజేయడం, వాళ్ళ పిల్లల చదువులుకు కూడా సహకరిస్తారని చెప్పడం.. అలాగే ఆచరణలో భాగంగా మొదటగా అనంతపురం జిల్లాలో కౌలు రైతు కుటుంబాలకు సాయం అందజేయడం.. రెండో విడతగా వెస్ట్ గోదావరి రైతులకు.. ఇప్పుడు మూడో విడతగా ఈ నెల 8 వ తారీఖు నుండి కర్నూల్ జిల్లా లో అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరింత బలంగా ప్రజలలోకి తీసుకొని వెళ్లే ప్రయత్నంలో ఎన్.ఆర్.ఐ జన సైనికుడు రాజా మైలవరపు ఆధ్వర్యంలో టీం పిడికిలి ప్రచురించబడిన గోడ పత్రిక పోస్టర్లను శుక్రవారం బండారులంక లో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కన్వీనర్ ఉప్పుగంటి భాస్కరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బట్టు పండు, కొప్పుల నాగ మానస, ఎంపీటీసీ సభ్యులు శ్రీమతి మోటూరి కనకదుర్గా, వెంకటేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి బొక్కా ఆదినారాయణ, టీం పిడికిలి కోనసీమ జిల్లా సభ్యులు బండి మణికంఠ, కొత్తపేట సభ్యులు వక్కపట్ల చంద్రశేఖర్, గనిశెట్టి గోపి సతీష్, చిట్టీనీడి సత్య మణికంఠ, బండారులంక జన సైనికులు గంపల ధనరాజు, శ్రీను, అర్లపల్లి తేజ, పల్లా భాను, సురేష్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గున్నారు.