ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిన వైకాపా

ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజమని, అపజయం తప్పదనే సంకేతాలతో
వైకాపా తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపి జనసేన పార్టీ నాయకులపై, సానుభూతిపరులపై దాడులకు పాల్పడటం, భయబ్రాంతులకు గురిచేయడం స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కు తగదని జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు అన్నారు. సార్వత్రిక ఎన్నికల రోజున అవనిగడ్డ మండల బందలాయిచెరువు గ్రామంలోని 154 వ నంబర్ పోలింగ్ బూత్ లో స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు జనసేన పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్లపై దాడులకు పాల్పడి, బెదిరింపులకు గురిచేయడాన్ని శేషుబాబు తీవ్రంగా ఖండించారు. రెండు లక్షలకు పైగా ఓటర్లకు ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యేకు ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలో తెలియదా అని శేషుబాబు ప్రశ్నించారు. సొంత గ్రామంలో సైతం తనకు ఓట్లు పడటం లేదని గ్రహించిన ఎమ్మెల్యే సొంత ఊరు మనుషులపై దౌర్జన్యం చేసి భయానక వాతావరణం సృష్టించడం మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా విష సంస్కృతిని వీడి ప్రజాక్షేత్రంలో జీవించాలని శేషుబాబు హితవు పలికారు. అదేవిధంగా బందలాయిచెరువు గ్రామంలో జనసేన పార్టీ నాయకులపై కానీ, జనసైనికులపై కానీ, సానుభూతిపరులపై కానీ, వారి ఆస్తులకు గాని ఏదైనా నష్టం జరిగితే దానికి సింహాద్రి రమేష్ బాబు పూర్తి బాధ్యత వహించాలని శేషుబాబు డిమాండ్ చేశారు. భయాన్ని వీడి స్వేచ్చా వాతవరణంలోకి అడుగుపెట్టేందుకు ఓటు హక్కుని వినియోగించుకున్న ప్రజలకు, పోలింగ్ సక్రమంగా జరిగేందుకు సహకరించిన అధికారులకు, పోలీసు సిబ్బందికి, పాత్రికేయులకు ధన్యవాదములు తెలియచేసారు. జనసేన పార్టీ బందలాయిచెరువు గ్రామ పార్టీ అధ్యక్షులు కమ్మిలి మారి బాబు మాట్లాడుతూ రాబోయే రోజులలో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ, తనకు సంబందించిన ఆస్తులకు గానీ ఏదైనా ప్రమాదం జరిగితే దాని పూర్తి బాధ్యత సింహాద్రి రమేష్ బాబు కారణమని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వచ్చి తమపై దాడి చేయడం, బెదిరింపులకు గురిచేయడం ప్రజలందరూ గమనించారని, ఎన్నికలు పూర్తయి 3 రోజులు గడిచినప్పటికి కూడా తమను తమ గ్రామంలో ఇంకా బెదిరిస్తున్నారని వాపోయాడు. తమకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వలన హాని కలిగే అవకాశం ఉందని మారిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గుడివాక రామాంజనేయులు, రంగిశెట్టి ప్రభాకర్, సింహాద్రి మోక్షనందం (బుజ్జి), సనకా గోపాలరావు, గరికిపాటి సుబ్రహ్మణ్యం, యర్రంశెట్టి సుబ్బారావు, కోసూరు అవినాష్, పాలేపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.