నేరెళ్ళపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

  • నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే నేరెళ్ళపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటాం- వంగ లక్ష్మణ్ గౌడ్
  • సొంత గ్రామంలోనే స్థానిక ఎమ్మెల్యే గారిపై తీవ్ర ప్రజా వ్యతిరేకత
  • పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా (పాదయాత్ర) 28వ రోజు

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం మూడో విడత గా తిమ్మాజిపెట మండలంలో 27వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం నేరెళ్ళపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ, మండల, నాయకులు జనసైనికులతో కలిసి వంగ లక్ష్మణ్ గౌడ్ గ్రామంలో పర్యటించారు. జనసేన పార్టీ పట్ల గ్రామంలో అపూర్వ ఆదరణ పొందుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు.. గ్రామంలోని ప్రజలు లక్ష్మణ్ గౌడ్ కు ప్రధాన సమస్యలు వివరిస్తూ వృద్ధులకు పించన్ అందటం లేదు.. మాటలకే నాగర్ కర్నూల్ అభివృద్ధి పరంగా రెండవ స్థానంలో ఉంది అని మాటలకు మాత్రమే పరిమితమా? ఉండటానికి ఇల్లు లేవు, పించన్ లేదు అని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోరు. సొంత గ్రామంలోనే ప్రజల సమస్యలు తీర్చలేని వారు నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేస్తారు.? రైతులకు రుణమాఫీ లేదు, డబల్ బెడ్ రూమ్ లేదు, దళిత బంధు, రైతు బంధు, రైతు రుణమాఫీ ఇలాంటి పథకాల పేర్లు కేవలం మాటలకే వాళ్ళతో పాటు తిరిగేవాళ్లకే మా సామాన్యులకు ఏది అందటం లేదు, నమ్మి ఓటు వేసిన ప్రజల సమస్యలు తిర్చలేని వీళ్లకు పదవులు ఎందుకు…? అంటూ గ్రామస్థులు లక్ష్మణ్ గౌడ్ తో ప్రభుత్వ నిర్లక్ష్య పాలనపై వారి సమస్యలు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గత సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు నుంచి మండలాల వారిగా పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాము. మేము తిరిగిన అన్ని గ్రామాల్లో సమస్యలు ఇలాగే ఉన్నాయ్, మీ యొక్క సమస్యలు తెలిసుకోవడనికే మేము వచ్చాం. మేము ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాం, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే నేరెళ్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాం అని హామీ ఇస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ నాయక్, వంగ విజయ్ భాస్కర్ గౌడ్, సూర్య, వంశీ రెడ్డి, బోనాసి లక్ష్మణ్, నవీన్, ప్రసాద్, పుస శివ, రాకేష్, బోనాసీ దేవేందర్, బొనాసీ రాజు, నరసింహ, మహేష్, ఆంజనేయులు, ఎస్. శివ, తాటికొండ శేఖర్, పేట శేఖర్, శివ స్వామి, గేర్క అంజి, భరత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.