కలుషిత నీటిపై స్పందనలో కలెక్టరుకు వరికూటి ఫిర్యాదు

దర్శి నియోజకవర్గంలో మంచినీటి సమస్యపై జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కి స్పందనలో ఫిర్యాదు చేశారు. కుళాయిల ద్వారా కలుషితనీరు వస్తున్నప్పటికీ వాటిని పట్టించుకునే నాధుడు లేరనీ, వాటిపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. దర్శి నియోజకవర్గంలో గతంలో ఫ్లోరైడ్ సమస్య ఉండేదని, ఇప్పుడు ఎన్ఏపి విడుదల చేస్తున్న కలుషిత నీటితో ఫ్లోరైడ్ సమస్య రావచ్చనన్నారు. ఎన్ఏపి విడుదల చేసే మంచినీరు మురుకు నీరు కంటే దారుణంగా ఉందని దీనితో దర్శి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు అంటూ కలెక్టర్ దినేష్ కుమార్ కు వరికూటి స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్ గారు, దర్శి టౌన్ జనసేన నాయకులు షేక్ ఇర్షద్, రెటైర్ద్ ఏపిజిబి చీఫ్ మేనేజర్ కొల్ల హనుమంతరావు, ఒంగోలు జనసేన నాయకులు చలపతి రాంబాబు, జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, లాయర్ గజ్జ అనిల్ బాబు, ఓబులాపురం కొండ, సుబ్బు, అండే నవీన్, తోట లోకేష్, మరియు జన సైనికులు తదితరులు హాజరయ్యారు.