అంగన్వాడీ వర్కర్స్ ధర్నాకు విడివాడ సంఘీభావం

తణుకు నియోజవర్గం: ఇరగవరం మండలం, ఇరగవరం గ్రామంలో మరియు అత్తిలి మండలం అత్తిలి గ్రామంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ వారు నిర్వహింస్తున్న ధర్నా కార్యక్రమంలో విడివాడ రామచంద్ర రావు మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగుల కోరికలు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, హెల్పర్స్ ప్రమోషన్లు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, వాళ్ళు చేసిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు. తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు మరియు ఇరగవరం మండల అధ్యక్షులు ఆకేటి కాశి, మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి దిరిశాల వెంకట్, అత్తిలి మండలం ఎంపీటీసీ బుద్దాల రాంబాబు, జనసేన పార్టీ నాయకులు, తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.