జనసేనాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: డా. గంగులయ్య

పాడేరు నియోజకవర్గం: రాజమండ్రి సెంట్రల్ జైల్ లో గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడును ములాఖత్ లో కలుసుకుని పరామర్శించి అనంతరం మీడియా సమావేశంలో పొత్తు అంశాలపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ మేరకు అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉన్న మేమంతా కూడా ఎఖీభవిస్తూ భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజాబాట పడతామని ఈ సందర్బంగా జనసేనపార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య అన్నారు. అదేసమయంలో పాడేరు నియోజకవర్గంలో పొత్తుల్లో భాగంగా నియమించే ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం అటు టీడీపీ పార్టీ శ్రేణులతో కలిసి సాగుతామన్నారు. ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన పరిపాలన, ఆదివాసీ హక్కులు, చట్టాలు సైతం తుంగలో తొక్కి చేసేటటువంటి అరాచక పాలనకు చరమా గీతం పాడాలంటే ఇదొకటే సరైన మార్గమని మేము కూడా బలంగా విశ్వసిస్తున్నాం. అందుకు మా పార్టీ నాయకులు, జనసైనికులెప్పుడు సిద్ధంగా ఉంటారని వారి ఉత్సాహం ముందు ప్రత్యర్ధులు చిత్తుగా తేలిపోతారని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మన ప్రాంతపు ఔన్నత్యాన్ని కాపాడుతూనే ప్రస్తుతం ఎదుర్కొంటున్న గిరిజన సమస్యలపై పోరాటం చేస్తామని అందుకు మా అధినేత ఇచ్చినటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తామని కాబట్టి రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని సాగణంపాలంటే సముష్టి కృషి అవసరమని మెమెప్పుడు తెదేపా పార్టీ మిత్రులతో కలిసి ప్రభుత్వ వ్యతిరేకవిధానాలపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే మా కార్యాచరణ ప్రణాళిక తెలియజేస్తామని ఈ సందర్బంగా జనసేన ఇన్చార్జ్ గంగులయ్య తెలిపారు.