వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం: పవన్ కళ్యాణ్

నేను కులాల ఐక్యతను కోరుకునేవాడిని, కులాల విభజన కాదు. కుల ప్రాధాన్యతలు పెరిగిపోతున్న తరుణంలో ఏ ఇతర కులాన్ని అగౌరపరచకుండా, తమ కులాన్ని అభిమానించుకోవడం ఒక సామాజిక అవసరంగా భావిస్తున్నాను అని వైవీ సుబ్బారెడ్డి గారు ఒక వాఖ్యం రాశారు. ఇంత ఉన్నతంగా రాసిన మీరు, ఒక కులాన్ని వర్గ శత్రువుగా ఎలా ప్రకటించుకున్నారు? తూర్పు గోదావరి జిల్లాలో కాపులకు, శెట్టి బలిజలకు పడదు అంటారు..పితాని బాలకృష్ణ గారు జనసేన లో చేరినప్పుడు ఏ కులంలో మనం పుట్టాలో అన్నది మన చేతుల్లో ఉండదని చెప్పాను. శెట్టిబలిజలు, కాపులు కలిసి ఉండండి..నాకు ఓట్లు వేస్తారని నేను ఈ మాట అనట్లేదు, సమాజం విచ్ఛిన్నం అవ్వకూడదు అని అంటున్నా..చంద్రశేఖర్ రెడ్డి అకారణంగా నన్ను పచ్చి బూతులు తిట్టాడు, అయినా నేను ఊరుకున్నా..

వైసీపీ ఓళ్ళు బలిసి, అధికార మదంతో కొట్టుకుంటున్న వైసీపీ కు కొమ్ములు ఇరగొట్టి, కింద కూర్చోపెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఇదే ఈ జనసేన 9వ ఆవిర్భావ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. బీజేపీ వారు రోడ్ మ్యాప్ ఇస్తా అన్నారు, దాని కోసం నేను వేచి చూస్తున్నా..ఆ రోడ్ మ్యాప్ వచ్చిన రోజున వైసీపీ వ్యతిరేఖ ఓటు బ్యాంక్ ను మొదలుపెడతాం. పార్టీలు, వ్యక్తిగత ప్రయోజనాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చినప్పుడు పొత్తులు గురించి ఆలోచిస్తా..నేను నలుగురికి ఇచ్చేవాడిని, 10 మందికి పెట్టేవాడిని, అందరూ బాగుండాలి అనుకునేవాడిని, వచ్చే భవిష్యత్తు గురించి ఆలోచించేవాడిని..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతను పవన్ కళ్యాణ్, జనసేన తీసుకుంటుంది.. భవిష్యత్తు జెండాను మొయ్యడం కంటే బాధ్యత ఏముంటాది, ఒక తరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటాది? కూల్చేవాడు ఉంటే కట్టే వాడు ఉంటాడు, విడదీసే వాడు ఉంటే కలిపే వాడు ఉంటాడు, చీకట్లోకి తోసే వాడు ఉంటే వెలుగులోకి లాగే వాడు ఉంటాడు, తల ఎగరేసే పాలకుడు ఉంటే ఆ తలను తన్నే పరాశరాముడు ఉంటాడు, దోపిడీ చేసే వైసీపీ ఉంటే దోపిడీని అడ్డుకునే జనసేన ఉంటాది . వైసీపీది ఆధిపత్యం, మనది ఆత్మగౌరవం..వైసీపీది అహంకారానికి అడ్డా..ఇది జనసైనికుల గడ్డ…జై జనసేన జై జనసేన జై జనసేన…జై హింద్..సర్వేజనా సుఖినోభవంతు అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.