ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాడ వాడలో జనసేన జెండానీ ఎగరవేస్తాం: గాదె

బాపట్ల నియోజకవర్గం: జనసేన పార్టీ కర్లపాలెం మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ సూచనల మేరకు కర్లపాలెం మండల ఉపాధ్యక్షులు – చిలకల సురేంద్రబాబు, చింతాయపాలెం గ్రామ అధ్యక్షులు – పెదమల్లు వేంకటేశ్వర్లు. గణపవరం గ్రామ అధ్యక్షులు – ఇమడాబత్తిన వెంకయ్య నాయుడు వీరి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో జనసేన జెండా ఆవిష్కరణ చేసిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో అధికార ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని, బటన్ నొక్కుతున్న అని చెప్పి మన డబ్బులు మనకే ఇస్తూ మభ్యపెడుతూ రాక్షస పాలన చేస్తున్నారని దుయ్యపట్టారు. ఈ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఇసుకను బకాసురుడులాగా అమ్ముకొని మరి జేబులు నింపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వమేనని ప్రజలు మరియు జనసైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను కలుపుకొని బాపట్ల నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా సూచించారు. తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ.. బాపట్ల నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా దోచుకుంటున్నరాని ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలవటం తధ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన శివన్నారయణ, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసీకుమారి, జనసేన పార్టీ శ్రేణులు & తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.