అన్నదాతలు..క్షమించండి.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తాం..! : ప్రధాని మోడీ

జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రసంగించారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల  సమావేశాల్లో దీనిపై ప్రకటన చేస్తామని వెల్లడించారు.  ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ తెలిపారు.  రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చిన్న రైతుల కోసం అనేక పథకాలు తెచ్చామని పేర్కొన్నారు. 10 కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమే ఉందని, అదే వారికి జీవనోపాధని అన్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను 5 రెట్లు పెంచిన ఘటన తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రూరల్‌ మార్కెట్‌ మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని చెప్పారు.ఇది కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తిరిగి తెరవనున్నట్లు చెప్పారు. అంతకముందు ‘ సిక్కుల మొదటి గురువు, సిక్కు మతస్థాపకులు గురునానక్‌ దేవ్‌ జీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని మోహబాలోని నీటి పారుదలకు సంబంధించిన పలు కీలక పథకాలను మోడీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర రక్ష సంపర్పణ్‌ పర్వ్‌ కోసం ఝాన్నీ వెళతారు. ‘ అని ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. 

          సుమారు సంవత్సర కాలం నుండి  ఈ సాగు  చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీ  సరిహద్దుల్లో అన ్నదాతలు  ఆందోళనలు చేపడుతున్నారు.  ఇప్పుడు ఈ చట్టాల రద్దు రైతుల విజయంగా భావిస్తున్నారు. అదేవిధంగా వచ్చే ఏడాది పంజాబ్, ఉత్తరప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ ప్రకటన ఇవ్వాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.