మీకెందుకు ఓటెయ్యాలి? అనంత వెంకట్రామిరెడ్డిని ప్రశ్నించిన కుంటిమద్ది

అనంతపురం, అనంత వెంకట్రామిరెడ్డి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మరొకమారు అనంతపురం నియోజకవర్గం ప్రజలు మీకెందుకు ఓటెయ్యాలి? 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మీ వైసిపి ప్రభుత్వం, మీరు పూర్తిగా విఫలమయ్యారు. మీకు చిత్తశుద్ధి ఉంటే అనంతపురం నియోజకవర్గం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయండి, ఎన్ని నిధులు తెచ్చారు? ఎంత ఖర్చు పెట్టారు? ఏమి అభివృద్ధి చేశారు? అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. అనంత వెంకట్రామిరెడ్డి 2019 ఎన్నికల ముందు అంత అర్బన్ నియోజకవర్గం ప్రజలకు మీరు ఇచ్చిన ప్రధాన ఎన్నికల హామీలు డంపింగ్ యార్డ్ తరలిస్తామన్నారు? తరలించారా? డంపింగ్ యార్డ్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సాక్షాత్తు మీ కౌన్సిల్ మీటింగ్ లో మీ కౌన్సిలర్లు మాట్లాడిన అవినీతి ఆరోపణలు అన్ని అబద్ధమని నిరూపించి మీ స్వచ్చశీలతను నిరూపించుకోగలరా? అండర్ డ్రైనేజీ సిస్టం పూర్తి చేస్తామన్నారు? చేశారా? అనంతపురం పట్టణ ప్రజలకు జగనన్న కాలనీలో ఎన్ని గృహాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించారు? పరసన్నయ్యపల్లి దగ్గర ఉన్నటువంటి టిడ్కో గృహాలు పూర్తి చేసి నగరానికి చెందిన లబ్ధిదారులకు ఎందుకు ఈ 5 సంవత్సరాల కాలంలో అందించలేకపోయారు? అనంత వెంకట్రామిరెడ్డి కేంద్ర ప్రభుత్వం నిధులతో క్లాక్ టవర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని దాదాపు 320 కోట్లతో నిర్మించడం జరిగింది. మీ ఒత్తిడి వలన అలైన్మెంట్ మార్చి నగరంలో వంకరటిక్కర రోడ్డు వేసింది వాస్తవం కాదా? క్లాక్ టవర్ దగ్గర కనీసం 10 షాపులకు కాంపన్సేషన్ చెల్లించి సర్వీసు రోడ్డు వెయ్యలేని నీచ స్థితిలో మీ ప్రభుత్వం, మీ పాలన సాగింది వాస్తవం కాదా? గుంతలమయంతో ఉన్న సర్వీస్ రోడ్లో నగర ప్రజలు ప్రతిరోజు ప్రయాణిస్తూ నరకయాతన అనుభవిస్తూ యాక్సిడెంట్స్ కి గురవుతూ ఆసుపత్రుల పాలు కావడం వాస్తవం కాదా? పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయింది, రాజీవ్ జోష్ కాలనీ, మరువకమ్మ లాంటి అనేక కాలనీలలో పారిశుద్ధ్య సమస్యతో నగర ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నది వాస్తవం కాదా? నగర ప్రజలకు కనీసం అవసరమైన తాగునీటిని కూడా సక్రమంగా అందించలేకపోవడం వలన నగర ప్రజలు దాహం తీరక నానా ఇబ్బందులు పడుతున్నారు, మినరల్ వాటర్ పేరుతో పది రూపాయలు ప్రతి బిందెకు వసూలు చేస్తూ నగరజ నగర ప్రజల సొమ్మును దోచుకుంటున్నది వాస్తవం కాదా? మీరు 2019 ఎన్నికల్లో గెలిచిన నాటినుండి నేటి వరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైనారని అనంతపురం నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా అర్థమయింది, జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గ ప్రజలు మీకు తగిన గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.