ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన పది లక్షల రూపాయలను వెనక్కి తీసుకుంటారా?: సర్వేపల్లి జనసేన

సర్వేపల్లి, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వాలు అయినా వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తూ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తాయి. వైద్యానికి కేటాయించిన నిధులను తిరిగి తీసుకున్నట్టు చరిత్రలో లేదు. ఈ కరోనా కష్టకాలంలో ఇది ఒక పేదవాడికి వైద్యం ఉచితంగా అందించే దిశగా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలి. మరి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆసుపత్రులకు కేటాయించిన నిధులను కూడా వదిలే పరిస్థితి కనిపించడం లేదు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా వీటికి అనుబంధంగా 477 కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా 24 గంటలు అందుబాటులో ఉండే ఆరోగ్య కేంద్రాలు 24 ఉన్నాయి. వైద్యవిధాన పరిషత్ కు సంబంధించిన 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికి సంబంధించిన 6.5 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకి వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది. ఈ ఆరోగ్య కేంద్రం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా హైవే మీద ఎవరికైనా అవసరం ఏర్పడినప్పుడు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యాన్ని అందించే విధంగా వెంకటాచలంలో సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉండేది. ఈ ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన రూ.పది లక్షల రూపాయలను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ విషయంపై స్థానిక సర్వేపల్లి శాసనసభ్యులు ఏ విధంగా సమాధానం చెప్తారో. మరి చూడాలి ఎందుకంటే వరుసగా మూడు రోజులపాటు పాలాభిషేకాలు చేశారు. మరి ఈరోజు పేదవాడికి వైద్యం అందించినటువంటి వైద్యశాల నిధులను ప్రభుత్వం ఖజానాకు మార్చేసుకుంది. మరి ఏ విధంగా వైద్యం అందిస్తారు. మరి దీని పైన ఎమ్మెల్యే ఏ స్థాయిలో చర్యలు తీసుకుంటారు అనే విషయాన్ని వారికే వదిలేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం పేద వారికి ఇచ్చే వైద్యం మీద ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది.