సిక్కోలు జనసేన క్రికెట్ టోర్నమెంట్ లో విన్నర్స్ బన్నీ టీమ్ మరియు రన్నర్స్ సీతంపేట టీమ్

సిక్కోలు క్రికెట్ టోర్నమెంట్ బుధవారం సీతంపేట టీమ్ కి, శ్రీకాకుళం బన్నీ టీమ్ కి ఫైనల్ 20 ఒవర్స్ మ్యాచ్ ఆడడం జరిగింది. మెదటి బ్యాటింగ్ బన్నీ టీమ్ 15 ఒవెర్స్ కి 109 పరుగులు కొట్టడం జరిగింది. బరిలోకి దిగిన సీతంపేట టీమ్ చివరి ఓవర్ లో వచ్చి 3 పరుగుల తేడాతో సీతంపేట టీమ్ ఓడిపోయింది. శ్రీకాకుళం బన్నీ టీమ్ 1 వికెట్ తేడాతో విజయం దక్కించుకోవడంతో శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు కోరాడ సర్వేశ్వరరావు విన్నర్స్ కి ₹40000 బహుమతిగా అందించడం జరిగింది. అతను మాట్లాడుతూ ఈ సిక్కోలు క్రికెట్ టోర్నమెంట్ మేనేజ్మెంట్ చేసిన ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రన్నర్స్ కి ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీగ కుమారుడు రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ జాయింట్ కో ఆర్డినేటర్ శ్రీ డా.విశ్వక్షేణ్ ₹20,000 రూపాయలు అందించారు. ఆయన మాట్లాడుతూ ముందు ముందు పార్టీ తరుపు నుంచి ఇంకెన్నో టోర్నమెంట్లు నిర్వహించి క్రీడాకారులకు మద్దతుగా నిలుస్తారని తెలియజేయడం జరిగింది. అలాగే మ్యాన్ ఆఫ్ ధ సీరీస్ ను పాతపట్నం ఇంచార్జ్ శ్రీ గేదెల చైతన్య అందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాల వారు క్రీదా రంగంలో సిక్కోలు కుర్రోళ్ళను ఎప్పుడు స్పూర్తిగా తీసుకునేలా మీరు ఆడాలని తెలియజేశారు. ఈ సిక్కోలు క్రికెట్ టోర్నమెంట్ మేనేజ్మెంట్ చేసినవారు కొండ, (శ్రీకాకుళం నాయకులు) ఉదయ్ శంకర్, గురు ప్రసాద్, సంజయ్, కామేష్, తేజ వీళ్లకు ఫైనల్ కు వెల్లిన ఇరు జట్టుల వారు అభినందనలు తెలిపారు. అలాగే ఈ టోర్నమెంట్లో బెస్ట్ అంపైర్స్ గా ముగ్గురూ ఎన్నుకోవడం జరిగింది. వీళ్లకు షీల్ద్ను లావేరు మండల యువ నాయకులు కాకర్ల బాబాజీ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా జనసైనికులు పాల్గొన్నారు.