పెడన వారాహి యాత్ర సభతో మంత్రి జోగి రమేష్ కి ఓటమి భయం పట్టుకుంది

  • టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జోగి రమేష్ కి ఉలికిపాటు ఎందుకు?
  • జోగి రమేష్ మైండ్ చెడిపోయే పిచ్చి కూతలు కూస్తున్నాడు
  • జనసేన-టీడీపీ కూటమికి కాపులను దూరం చేయాలనే కుట్రలు ఫలించవు
  • శ్రీ పవన్ కళ్యాణ్ గారి బ్లడ్ లోనే సేవ చేసే గుణం, పదిమందికి మంచి చేయాలనే ఉద్దేశ్యం ఉన్నాయి.
  • జనసేన నాయకుడు యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన నియోజకవర్గం: వారాహి విజయ యాత్రలో భాగంగా అక్టోబర్ 4, బుధవారం పెడన నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభ విజయవంతం అవ్వడంతో మంత్రి జోగికి మతి భ్రమించి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని జనసేన నాయకుడు యడ్లపల్లి రామ్ సుధీర్ పేర్కొన్నారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిన్నటి సభ భారీ విజయాన్ని సాధించింది పెడన నియోజక వర్గంలో ఉన్న సామాన్య ప్రజల దగ్గరనుంచి, వ్యవసాయ రంగం, చేనేత రంగం , ఆక్వా రంగం, ముస్లిం సమాజం అందరూ కూడా ఈ యాత్రకు పూర్తి మద్దతు తెలిపి విజయవంతం చేశారు.
మా అధినేత ప్రశ్నించింది ఒక్కటే పెడన నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను గురించి ప్రశ్నించడం జరిగింది ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఉందా?. నువు మా అధినేతను మాట్లాడితే ఏక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తాను అని కారుకూతలు కూస్తున్నావ్. ఈ రోజున పెడన నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభను పెట్టీ ఆ సభలో పెడన నియోజకవర్గంలో నువు చేసే అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తే దానికి నువు సమాధానం చెప్పలేక ఇలాంటి కారుకూతలు కూస్తున్నావా? పెడన నియోజకవర్గ ప్రజలు అందరూ నిన్ను పెడన నుంచి సాగనంపడానికి సంసిద్ధంగా ఉన్నారు 2009 లో నీ రాజకీయ భవిష్యత్ పెడన నియోజకవర్గం నుంచి మొదలుపెట్టావు 2024 లో నీ రాజకీయ భవిష్యత్ ముగిసినట్టే.. నువ్వు ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే. మా అధినేత బ్లడ్ లోనే సేవ చేసే గుణం ఉంది. ప్రజా సమస్యల కోసం పోరాడే తత్వం ఉంది. పది మందికి మంచి చేయాలనే ఉద్దేశ్యం ఉంది. పోరాటాలంటే నువు అర్ధరాత్రి సమయంలో నంబర్ ప్లేట్ లేని కారుల్లో ఎవరిని తీసుకువచ్చి పోరాటాలు చేసావో అందరికీ తెలుసు పెడన నియోజకవర్గం ప్రజలందరూ నిన్ను గమనిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారానే ప్రజలందరూ నీకు జోల పాట పాడేశారు, నీకు ఇంకా రాజకీయ భవిష్యత్ లేదు అది తెలుసుకుని నువ్వు ఇలా నీ కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం కారు కూతలు కూస్తు చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. మా అధినేత రాష్ట్ర ప్రజల శ్రేయస్సే కోసం, భావితరాల భవిష్యత్ కోసం టిడిపి తో పొత్తు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని అన్నీ వర్గాల ప్రజలు ఈ పొత్తు నిర్ణయానికి ఆమోదం తెలిపారు రాబోయే ప్రజా ప్రభుత్వంలో పెడన నియోజక వర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చి ప్రజలకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని రామ్ సుధీర్ తెలియజేసారు.