పాఠశాల స్థాయి నుండే ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తలను తయారు చేయవచ్చు: పాశం నాగబాబు

నూజివీడు: ముసునూరు మండలంలోని రమణక్కపేట జెడ్పీ హైస్కూల్ నందు బుధవారం స్కూల్ లెవెల్ సైన్స్ ఫెయిర్ ప్రదర్శన మండల విద్యా శాఖ అధికారి రత్నకుమార్, ప్రధానోపాధ్యాయులు శారద పర్యవేక్షణలో, అధ్యాపకుల అధ్వర్యంలో జరిగినది. ఈ సైన్స్ ఫెయిర్ లో విద్యార్దుల ప్రదర్శనలు దాదాపు 100 కి పైగా అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ తరపున స్కూల్ సిబ్బందితో కలిసి విద్యార్దులకు బహుమతుల ప్రదానం చేసిన పాశం నాగబాబు, త్రినాథ్, గోపి, సాయి.