యద్భావం తద్భవతి

భీష్మ పితామహుడు తన జీవితంలో ఒకేఒక్క పెద్ద తప్పు చేశాడు. సరైన టైంలో కోపం ప్రదర్శించలేదు. ద్రౌపదిని వివస్త్రను చేసినపుడు.

జటాయువు జీవితం ధర్మానికి ప్రతినిధిగా నిలిచింది. తను సరైన టైంలో కోపం ప్రదర్శించింది. సీతమ్మను రావణుడు అపహరిస్తున్నప్పుడు అతని నుంచి విడిపించడానికి ప్రయత్నం చేసింది

సమయం వచ్చినప్పుడు ఇద్దరూ చనిపోయారు, కానీ.. భీష్ముడు బాణాల మంచంపై మరణించాడు.. మరి జటాయువు మాత్రం శ్రీరాముని ఒడిలో మరణించింది. మీరొక విషయం గుర్తుచేసుకోవాలి.. నైతికత, నీతికోసం కోపం ప్రదర్శించాల్సిన పరిస్థితి వస్తే.. కోపం అనేది ఆశీర్వాదంగా మారుతుందని మన వేదాలు చెబుతున్నాయి. అంతేకాదు, మరోవైపు నీతి, నైతికత కాపాడుకోలేనప్పుడు ఓర్పు అనేది శాపంగా మారుతుందని మన వేదాలు చెబుతున్నాయి. కొందరు జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ లో కేవలం భావోద్వేగమైన్ కోపం మాత్రమే చూస్తున్నారు గానీ, దాని వెనక ప్రస్తుత రాజాకీయ నాయకుల వ్యవహారశైలి పట్ల మనోవేదనను అర్ధం చేసుకోలేకపోతున్నారు. అందరిలా పవన్ కళ్యాణ్ కూడా విలాసవంత జీవితం గడపొచ్చు తనను ఇంత ఆదరించి ఇచ్చిన స్టార్డం ని తిరిగి సమాజానికి సేవ రూపంలో తనవంతు చేయడానికి బాధ్యతగా పార్టీ పెట్టి నడిపిస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు పైబడినా ప్రస్తుత రాజకీయ నాయకుల తీసుకునే నిర్ణయాలతో పేదవాడు పెదవాడుగానే మిగిలిపోయాడు. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. ధనవంతులు రాజ్యమేలుతున్నారు. చట్టాలు, న్యాయం బలవంతులకు బలహీనంగానూ బలహీనులకు బలంగాను పనిచేస్టున్నాయని ఆయన కొన్ని దశాబ్దాలుగా వ్యధ చెంది ఆలోచించారు. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల నరికే చట్టం రావాలంటున్నారు. తన చుట్టూ సామాన్యులకు అన్యాయం జరుగుతుంటే సహించలేనప్పుడు కోపం రావడం సహజ ప్రక్రియ.. జాతిని చైతన్యం చేసేటప్పుడు ఆవేశం ఉండాలి.. ఒక్క కోపమే కాదు మనిషిలో ఉండాల్సిన అన్నీ కోణాలు ఆయన్ని నిశితంగా గమనిస్తే కనబడతాయి. అందుకోసం ఆయన ప్రసంగాలు కొన్ని శ్రద్ధగా చూసి వింటే మిగిలిన రాజకీయ నాయకులకు ఈయనకు ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది. ఆయనలాంటి మానవత్వం ఉన్న మరో నాయకుడు కనుచూపుమేర భూతద్దం పెట్టి వెతికినా కనబడరు.

గోపాలకృష్ణ,
రాజేంద్రనగర్ నియోజకవర్గం.