వాలంటీర్ కు అండగా నిలిచిన యడ్లపల్లి రామ్ సుధీర్

  • వాలంటీర్లను వైసీపీ కూలీల కన్నా హీనంగా చూస్తోంది
  • మాటల్లో వాలంటీర్లు దేవుళ్లు.. కానీ చేతల్లో కట్టు బానిసలు
  • మా ఎస్సీ.. మా బీసీ అంటూ జోకర్ జోగి మాటలకే పరిమితం
  • మంత్రిగా నువ్వు ఎంత మంది ఎస్సీ, బీసీలకు ఇళ్ళిచ్చావు
  • మీ బాస్ బాటలో నువ్వు మాత్రం ప్యాలెస్ లు కట్టుకుంటావు
  • పెడన నియోజకవర్గానికి పట్టిన దరిద్రం జోగి రమేష్
  • ఎస్సీ, బీసీలకు అండగా నిలిచే పార్టీ జనసేన మాత్రమే
  • క్యాన్సర్ భారిన పడిన గూడూరు మండలం, గూడూరు గ్రామం 7వ వార్డు వాలంటీర్ కి జనసేన ఆర్ధిక సాయం
  • రూ. 50 వేలు అందించిన పెడన నియోజకవర్గం జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన నియోజకవర్గం: వైసీపీ నేతలకు మాటల్లో వాలంటీర్లు దేవుళ్లు.. చేతల్లో మాత్రం ఆ పార్టీకి కట్టు బానిసలకంటే హీనంగా చూస్తున్నారని జనసేన పార్టీ పెడన నియోజకవర్గ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ అన్నారు. వాలంటీర్లను వైసిపి కూలీలకన్నా హీనంగా చూస్తోందని తెలిపారు. మాట్లాడితే మా ఎస్సీ.. మా బీసీ అంటారు. ఆ ఎస్సీ, బీసీలకు కష్టం వస్తే మాత్రం అధికార పార్టీ నాయకులు తొంగిచూడరన్నారు. పెడన నియోజకవర్గానికి పట్టిన దరిద్రం ఈ జోకర్ జోగి రమేష్ అయితే ఓటు వేసిన జనాన్ని పురుగులకంటే హీనంగా చూస్తున్నాడని ఆరోపించారు. సోమవారం పెడనలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గర్బాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న గూడూరు గ్రామం 7వ వార్డు వాలంటీరు కంచర్ల ప్రశాంతికి జనసేన పార్టీ తరఫున రూ. 50 వేల ఆర్ధిక సాయం అందచేశారు. డిగ్రీ చదివి వాలంటీరుగా పని చేస్తున్న ప్రశాంతి గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతోంది. వ్యాధి 3వ స్టేజీలో ఉండడంతో లక్షల్లో ఖర్చచవుతుందని డాక్టర్లు చెప్పారు.
మంత్రి జోగి రమేష్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కనికరించలేదు. దీంతో వారు సాయం కోసం జనసేన పార్టీని ఆశ్రయించారు. స్థానిక పార్టీ శ్రేణుల ద్వారా దళిత మహిళా వాలంటీర్ కష్టాన్ని తెలుసుకున్న జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్, ప్రశాంతి భర్త కంచర్ల ప్రసాద్, తండ్రి బొడ్డు అమలేశ్వర రావుకు రూ. 50 వేల ఆర్దిక సాయం అందచేశారు. ఈ సందర్భంగా రామ్ సుధీర్ మాట్లాడుతూ.. జోకర్.. బ్రోకర్ జోగి రమేష్ కి తన పచ్చ తప్ప తనకు ఓటు వేసిన పేద ప్రజల పచ్చ అసలు గిట్టదన్నారు. జోగి రమేష్ రోజూ చెప్పే మా ఎస్సీ.. మా బీసీ అంతా కల్లబొల్లి కబుర్లేనని.. దళిత సోదరులు జోగి మాయలో పడొద్దని అన్నారు. ఎస్సీలు, బీసీల మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నిన్ను గెలిపించిన పెడన నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఎంత మంది ఎస్సీలు, బీసీలకు ఇళ్లు కట్టించి ఇచ్చావో చెప్పాలని సవాలు విసిరారు. ఉరిమిలో భారీ వర్షాలకు ఓ ఎస్సీ మహిళ ఇల్లు కూలిపోతే పలుకరించిన దిక్కు లేదన్నారు. దాచుకో.. దోచుకో స్కీము ద్వారా దండుకున్న కోట్లాది రూపాయిలతో జోగి రమేష్ మాత్రం ఇబ్రహీపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ కి ఎవరికీ ఎంట్రీ లేదు. త్వరలోనే ఆ ప్యాలెస్ రహస్యాలు కూడా బయటపెడతాం. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగ్గూభాయ్ కి బెంగళూరులో ప్యాలెస్ కట్టుకుంటే, జోగి రమేష్ ఇబ్రహీపట్నంలో కట్టుకున్నాడు. ప్యాలెస్ లు కట్టుకోవడానికి కోట్లు ఖర్చు చేస్తారు. నువ్వు, నీ కోడుకు పుట్టిన రోజులకి లక్షలు ఖర్చు చేస్తారు. పేదోడికి కష్టం వస్తే మాత్రం స్పందించరు. మాట్లాడితే వాలంటీర్లు మా దేవుళ్లు అని పాద పూజ చేస్తారు.. అదే మీ వాలంటీర్ కి కష్టం వస్తే ఎందుకు స్పందించలేకపోయారు. వాలంటీర్లంతా వైసీపీ కపట నాటకాలను, కపట ప్రేమను గ్రహించాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీతో డేటా చోరి అనే అతి పెద్ద క్రైమ్ వైసిపి చేయిస్తోంది. వాలంటీర్లు వైసీపీ ఉచ్చులో పడొద్దు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా నిలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అండగా నిలిచే పార్టీ ఏకైక పార్టీ జనసేన మాత్రమే. వెనుకబడిన వర్గాల సమస్యల మీద పోరాడే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. జోగి రమేష్ పెడన నియోజకవర్గానికి పట్టిన దరిద్రం. ఈ దరిద్రాన్ని వదిలించుకునేందుకు మా పెడన నియోజకవర్గం మా ఎస్సీలు, మా బీసీలు, మా పేద కాపులు సిద్ధంగా ఉన్నారు. నిరుపేదల్ని చులకనగా చూసే నీకు కాలం చెల్లింది. 2024లో నువ్వు మాజీ కావడం ఖాయమన్న విషయం గుర్తుపెట్టుకోమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓడుగు ప్రభాస్ రాజు, కృష్ణా జిల్లా కార్యదర్శి తిరుమల శెట్టి చంద్రమౌళి, జనసేన నాయకులు కూనపరెడ్డి రంగయ్య, జాతీయ బిసి సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు పోలగాని లక్ష్మీ నారాయణ, పుల్లేటి దుర్గారావు, బంటుమిల్లి మండల ఉపాధ్యక్షులు గోట్రు రవి కిరణ్, వరుదు రాము, కొప్పినేటి నరేష్, పెన్నేరు మణికంఠ, గడ్డిగోపుల నాగ, కొఠారి మల్లి బాబు, బాకీ హరీష్, నారహరిసెట్టి ప్రసాద్, మరియు స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.