గద్దర్ కి ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు

పాడేరు నియోజకవర్గం: జి.మాడుగుల జనసేన పార్టీ నాయకులు. ఉధ్యమకారుడు, ప్రజాగాయకుడు కీర్తిశేషులు గద్దర్ కి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా మండల నాయకులు జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ.. గద్దర్ కేవలం సామాజిక ఉధ్యమకారుడే కాదు బడుగు బలహీనుల గొంతు, ధిక్కారస్వరం, మార్పు కొరకు బలంగా తపించి కవి, తన పాటలతో ప్రజల ఆలోచన చైతన్యం దిశగా నడిపించిన యోధుడు ఆదివారం ఆ విప్లవ జ్యోతి ఆరిపోయింది. కాలపరిక్షలో ఆ వీరుడీ నిష్క్రమణ మార్పుకోసం తపించే అభ్యుదయవాదులకు జీర్ణించుకోలేని విషయం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ కి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇద్దరు ఏకాభిప్రాయం కలిగిన వ్యక్తులు మన ఇన్చార్జ్ డా. గంగులయ్య గారు స్వయంగా గద్దర్ తో ఉద్యమంలో కలిసి ప్రజాచైతన్యం కోసం పని చేసారు. ఈ తరం నవయువకుల్లో అటువంటి సామాజిక స్పృహ కలిగిన వారందరినీ ఒకే తాటిపై నిలపడమంటే అది సామాన్యమైన విషయం కాదు. మనమంతా ఒకే బావజాలంతో ఏకీభవించిన వారమే. అందుకే ప్రజాగాయకుడు గద్దర్ పరమపధిస్తే మనమందరు జీర్ణించుకోలేకున్నాం. జనసేనానికి ప్రజాగాయకుడు గద్దర్ దివికెగిసిపోయారని వార్త తెలిసిన వెంటనే ఎటువంటి భావోద్వేగానికి గురయ్యారో మనమంతా అదే భావోద్వేగానికి గురయ్యాం. అతనితో ఉద్యమబాటలో కలిసిన నడిచిన గంగులయ్యగారి ఉద్వేగం మనం వర్ణించలేము? ఏది ఏమైనా ఒక ప్రజా ఉద్యమకారుడిని కోల్పోయాం అతని ఆత్మకి శాంతి ప్రసాదించాలని కోరుకుందాం. జోహార్ గద్దర్ జోహార్ ప్రజనాయకుడా అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు. జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, ప్రధాన కార్యదర్శి గొంది మురళి, చింతపల్లి నాయకులు ఉల్లి సీతారామ్, పవన్ కళ్యాణ్ వంతల, తల్లే త్రిమూర్తి, కార్యనిర్వహన అధ్యక్షులు తాంగుల రమేష్ పాల్గొని నివాళులర్పించారు.