కోటి గ్రామంలో పలుకుటుంబాలను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, కోటి గ్రామంలో బుధవారం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ పర్యటించి పలు కుటుంబాలను పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మరణించిన కొట్టు రాజు కుటుంబాన్ని.. ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోయిన వారి కుటుంబాన్ని పరామర్శించి 5,000/- రూపాయలు ఆర్ధిక సహాయం, 25 కేజీల బియ్యం అందజేశారు.. అనంతరం పీతల మాలయ్య అనారోగ్యంతో బాధపడ్తున్నారని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని కుటుంబ అవసరాల నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్ధిక సహాయం, 25 కేజీల బియ్యం అందజేశారు. అనంతరం డొక్కా దైవావతి వృద్ధాప్య వయసులో కుటుంబ పోషణ కోసం వయసు సహకరించకపోయినా కష్టపడుతున్నారు. విషయం తెలుసుకుని వారికి 5,000/- రూపాయలు ఆర్ధిక సహాయం, 25 కేజీల బియ్యం అందజేశారు. అనంతరం బొల్లెద్దుపాటి శ్రీనివాసు ఇటీవల స్వర్గస్తులయ్యారు. వారి కుటుంబాన్ని పరామర్శించి మనో దైర్యం చెప్పి 5,000/- రూపాయలు ఆర్ధిక సహాయం, 25 కేజీల బియ్యం అందజేసి, మీకు జనసేన పార్టీ ఎల్లపుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసారు. అనంతరం తంబాబత్తుల ఆంజనేయులు గారు అనారోగ్యంతో బాధపడ్తున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్ధిక సహాయం, 25 కేజీల బియ్యం అందజేశారు. కొమ్మూరి వీర్రాజు, కొమ్మూరి నరసాయమ్మ దంపతులు వృద్ధాప్యంలో ఇళ్ళు గడవడానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారిని పలకరించి జనసేన పార్టీ తరపున 5,000/- రూపాయలు ఆర్ధిక సహాయం, 25 కేజీల బియ్యం అందజేశారు. అనంతరం వల్లభశెట్టి శ్రీరామమూర్తి స్వర్గస్తులయ్యారు.. వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మనో దైర్యం చెప్పి 5,000/- రూపాయలు ఆర్ధిక సహాయం, 25 కేజీల బియ్యం అందజేశారు.. అనంతరం బండారి శ్రీను గారు ఇటీవల ప్రమాదంలో కాలికి గాయం కావడంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో ఉన్నారని తెలుసుకుని, వారి కుటుంబాన్ని కలిసి వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరపున 5,000/- రూపాయలు ఆర్ధిక సహాయం, 25 కేజీల బియ్యం అందజేశారు. అనంతరం దేవన వీరబాబు అనారోగ్యతో బాధపడ్తున్నారన్న విషయం తెలుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వైద్యుల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన సీనియర్ నాయకులు నండూరి సూర్యనారాయణ, నండూరి మంగరాజు, తంబాబత్తుల పోసయ్య, గట్టి గన్నయ్య, దేవన కృష్ణ, అడపా సీతారాముడు, ఉల్లి సూరన్న కాపు, నండూరి కృష్ణ, నండూరి శ్రీరామ, నండూరి ఆంజనేయులు, వేట్ల సుబ్రహ్మణ్యం, నండూరి నాగు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మేడిశెట్టి శివరామ్, కిమిడి శ్రీరామ్, మదిరెడ్డి బాబులు, నరాల లోవరాజు, ఆలపాటి వెంకటేష్, కట్ట వెంకన్న బాబు, తోట అనిల్ వాసు, నండూరి దొరబాబు, దేముళ్ళు, అడబాల కృష్ణ, అడబాల వెంకటేష్, పెట్ల శ్రీను, నండూరి నరసింహారావు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.