కందుల దుర్గేష్ ను విమర్శించే అర్హత వైసిపి నాయకులకు లేదు: గెడ్డం నాగరాజు

రాజమండ్రి సిటీ, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు జనసేన పార్టీ కోసం మాట్లాడే అర్హత లేదని అధికార దుర్వినియోగంతో జీవోలను పాస్ చేస్తూ సభలను అడ్డుకోవాలని చూడడం దారుణమని మొన్న రాజమండ్రిలో పెన్షన్ల పెంపు సిఎం సభ విషయంలో ప్రజలను ప్రలోభ పెడుతూ వారికి వచ్చే పథకాలను ఆపుతానని బెదిరించి సభకు తరలించిన వైనం దారుణమని మద్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందడుగులో ఉందని ఏ విధంగా యువతను బానిసలుగా తయారు చేస్తున్నారని యువతకు ఉపాధి కల్పించే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వచ్చారని అందుకోసమే ఈనెల 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభను నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకు భారీ ఎత్తున యువత కదిలి రావాలని మన భవిష్యత్తు మన బాధ్యతని ఈ గవర్నమెంట్ మద్యం మీద పెట్టిన దృష్టిని యువత భవిష్యత్తుపై పెట్టాలని రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలని ఆకాంక్షిస్తున్నారని జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ నగర ప్రధాన కార్యదర్శి వెంకట పైడ్రాజు, నల్లంశెట్టి వీరబాబు, జనసైనికులు విక్టరీ వాసు, సెశెట్టి ప్రసాద్, హేమ దుర్గ తదితరులు పాల్గొన్నారు.