మీ పాలన ఇంకో ఐదు నెలలే: యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెడన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ మాట్లాడుతూ కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేల మారు అన్న చందంగా రాష్ట్రం పరిస్థితి తయారయ్యింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరిదీ అదే దారి, ప్రజలు సమస్యలు చెప్పుకోకూడదు.. ప్రతిపక్షాలు ప్రశ్నించ కూడదు.. ప్రజలు ప్రశ్నిస్తే పథకాలు తీసేస్తారు. బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రజల తరఫున మాట్లాడితే వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతారని, జనం రోడ్డు మీద ఛీ కొడ్డుతున్నా ఏ మాత్రం సిగ్గూ శరం లేని బతుకులు. ప్రజలకు అన్యాయం చేసి పరదాలు కట్టుకుని తిరగడానికి ఆ ముఖ్యమంత్రికి సిగ్గు ఉండదు. ఆ ముఖ్యమంత్రికి బాకాలు ఊదేందుకు ఈ మంత్రులకు సిగ్గు ఉండదని, కులం చూడం.. మతం చూడం.. పార్టీలు చూడం.. మాటలు చెప్పావుగా జోగి రమేష్.. మరి ప్రశ్నించిన ప్రజల పథకాలు ఎందుకు తీసేయమన్నావ్.. ఇలా పథకాలు ఇచ్చి అలా కరెంటు బిల్లులు, చెత్త పన్నులు అంటూ లాక్కుపోతోంది నిజం కాదా? ప్రజలు నిజం మాట్లాడితే అంత ఉలిక్కిపాటు ఎందుకు నీకు? నడిపూరులో ప్రజలు ప్రశ్నించారని పథకాలు తీసేయమన్నావు.. అలాగే ఆ పథకాలు తీసేసిన వాళ్లకి పెంచిన కరెంటు బిల్లులు తగ్గించే దమ్ము నీకుందా? ఓట్ల కోసం మాత్రం జనం కాళ్లు పట్టుకుంటావు.. ఓట్లేసిన ప్రజలు ప్రశ్నిస్తే తట్టుకోలేవు.. ఇదేమైనా రాచరికం అనుకుంటున్నావా? మొన్న అసెంబ్లీకి పంపిన జనమే రేపటి రోజును నిన్ను తన్ని తరిమేస్తారు జాగ్రత్త. నీకు పెడనలో రోజులు దగ్గర పడ్డాయి.. ఎంత మంది పథకాలు తీసేస్తావో తీసెయ్.. చూద్దాం.. అన్నీ జగనన్న ఇచ్చిన పథకాలే కదా? అంట నీ జేబులో నుంచి ఇస్తున్నావా? మీ ముఖ్యమంత్రి జేబులో నుంచి ఇస్తున్నాడా? ప్రజలు కట్టిన పన్నుల్ని పప్పుబెల్లాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది కాకుండా? జగనన్న ఇచ్చాడు.. జగనన్న తాత రాజారెడ్డి ఆస్తులు ఏమైనా అమ్మి తీసుకువచ్చి ఇస్తున్నాడా? లేక రెండు పెళ్ళిళ్లు చేసుకున్న వాళ్ల ముత్తాత వెంకట్ రెడ్డి ఏమైనా ఆస్తులు ఏమైనా ఇస్తున్నాడా? మొన్నటికి మొన్న బీసీ సోదరుడు లేచి నిలబడలేదని అరెస్టు చేయించిన ఘనత నీది. లేచామా? తిన్నామా? తాగామా? రాత్రిళ్లు నంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో తిరిగామా? కళ్లు ఉబ్బే వరకు పడుకున్నామా? ఇంతకు మించి నీకు దినచర్య ఏముందో చెప్పు. ప్రజలు పన్నుల భారం భరించలేమని చెప్పుకుంటే పథకాలు తీసేస్తావా? ప్రజల సమస్యలు వినీ ఓపిక లేనప్పుడు గడప గడపకీ తిరగడం ఏందుకురా జోకర్ రమేష్.. నీ రోజువారి పనులు నువ్వు చేసుకుని మైలవరం ప్యాలెస్ లో పడుకోక పథకాలు తీసేస్తామన్నా ప్రజలు భయపడే పరిస్థితులు లేవు.. పథకాలు తీసేస్తే తీసేసుకోమంటున్నారంటే. మీ పాలన ఇంకో ఐదు నెలలే అన్న సంగతి వాళ్లకి కూడా అర్ధం అయిపోయింది. మీకు కూడా అర్ధం అయితే మంచిది. అక్కడ వీళ్ల ముఖ్యమంత్రి అయితే ఏకంగా వీళ్లందరికంటే అమ్మామొగుడిలా తయారయ్యాడు.. పొత్తుల తర్వాత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ మీద ప్రజల్లో విపరీతమైన చర్చ సాగుతుండడంతో అది తట్టుకోలేక రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నానన్న కనీస ఇంగితం మరిచి మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఈ ప్రభుత్వ కాలం మరో ఐదు నెలలే అన్న సంగతి ప్రజలకి అర్ధం అయ్యింది. పోలీసు శాఖలో ఉన్న కొంత మందికి అర్ధం కావడం లేదు. స్థానిక పోలీసులు మంత్రికి వత్తాసుగా జనసైనికుల మీద వేధింపులకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు మానకుంటే మీకే మంచిది. అధికారం శాశ్వతం కాదు. ఇవాళ వీళ్లుంటే, రేపు మేముంటాం. ఆ సంగతి మర్చిపోవద్దు. మా జనసేన కార్యకర్తలకు ఆధార్ కార్డులు ఇవ్వమంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారంట. మీరు ప్రభుత్వానికి తొత్తులుగా పని చేయాలంటే ఖాకీలు తీసేసి వెళ్లి పని చేసుకోండి. మా వాళ్ల ఆధార్ కార్డులు మీకెందుకు? మంత్రి పోద్భలంతా అక్రమంగా మా వాళ్ల మీద కేసులు బనాయించి వేధించాలని చూస్తే మా నుంచి గట్టి ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నామని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సయ్యద్ షఫీ, కునప రెడ్డి రంగయ్య, పుల్లేటి దుర్గా రావు, సింగంశెట్టి అశోక్ కుమార్, కొప్పినీటి శివమణి, బాకీ నాని, కొఠారి మల్లిబాబు, కోలపల్లి శ్రీకాంత్, నందం శివ స్వామి తదితర జనసైనికులు పాల్గొన్నారు.