యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొవాలి: దాసరి రాజు

ఇచ్చాపురం: జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకున్న స్వతంత్ర సమరయోధులు శ్రీ భగత్ సింగ్. అధినేత ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉద్దేశంతో గత సంవత్సరం ఇచ్చాపురం మండలం లోద్దపుట్టి గ్రామంలో భగత్ సింగ్ విగ్రహాన్ని ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ దాసరి రాజు ఆవిష్కరించారు. గురువారం భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా లొద్దపుట్టుగా గ్రామ పెద్దల సమక్షంలో ఆయనకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొవాలని, అతి చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన మనకు స్ఫూర్తి అయ్యేవిధంగా కొంత సమయం దేశసేవకు కేటాయించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో లొద్ద పుట్టి గ్రామ పెద్దలు తిప్పన దామోదర్ రెడ్డి, ఇచ్చాపురం మున్సిపాలిటీ ఇంచార్జ్ లు రోకళ్ల భాస్కరరావు, కలియ గౌడో, జనసేన నాయకులు తిప్పన సురేష్, నీలాపు సతీష్, రంగాల హేమంత్ తదితరులు పాల్గొన్నారు.