Jubileehills: జనసేన కండువా కప్పుకున్న యూసఫ్ గూడ యువత

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసఫ్ గూడ నుండి అధిక సంఖ్యలో యువత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా యువకులందరికి జనసేన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.