జగనన్న కాలనీలో జగనన్నకి స్కాంలో లాభం తప్ప పేదప్రజలకు కన్నీరే మిగిలింది

  • నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు

నూజివీడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న మోసం అనే కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ముసునూరు మండలంలోని గోపవరం, కాట్రేనిపాడు, ముసునూరు గ్రామాల్లో ప్రభుత్వం అందజేసిన జగనన్న ఇళ్ల స్థలాలను జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ళ స్థలాల పేరుతో వైసీపీ స్థానిక నాయకులు అసైన్మెంట్ స్థలాలను, ఊరికి దూరంగా ఉన్న భూములను, చెరువులు దేనికి పనికి రాని 10 లక్షల రూపాయిల విలువ కూడా లేని భూములను ఎకరం 25 లక్షలకు విలువ కట్టి జేబులు నింపుకునే పెద్ద స్కాంలు జరిగాయని, ప్రభుత్వం లక్షలాది ఇళ్లను మంజూరు చేశామని, ఇప్పటివరకు దాదాపు 50 శాతం ఇళ్లను పూర్తిచేశామని చెబుతూ పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చాలాచోట్ల ఇప్పటివరకు పనులు కూడా పూర్తిగా ప్రారంభం కాలేదని కానీ ప్రభుత్వం పూర్తి చేసినట్లు చెబుతున్నారని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్నట్టు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ యొక్క ఇళ్ల స్థలాలను పర్యటించి వీరందరికీ న్యాయం జరిగేలా జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, ముసునూరు మండల వైస్ ప్రెసిడెంట్ బోట్ల నాగేంద్ర, నాయకులు చేబత్తిన విజయ్, వేట త్రినాథ్, గిరి గోపి, మొగళ్ళ నాగరాజు, చేకూరి అనిల్, చిల్లిముంత సోమరాజు, గోవర్ధన్ జనసైనికులు పాల్గొన్నారు.