న్యాయం కోసం సింగరాయకొండ సిఐని కలిసిన జనసేన నాయకులు

  • జనసేన రాజేష్ కు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన సిఐ

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, సింగరాయకొండ పంచాయితీలో అవినీతి జరిగిందని సింగరాయకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ గతవారంలో జిల్లా కలెక్టర్ కి స్పందన కార్యక్రమంలో ఆధారాలతో సహా అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ మరుసటి రోజు సింగరాయకొండ వైసీపీ నాయకులు అయినటువంటి ఎస్కె గౌస్ బాషా మరియు ఎస్కె నౌషాద్ లు రాజేష్ కి ఫోన్ చేసి అసభ్యకరంగా దుర్భాషలాడి, అదేవిధంగా తన ఇంటి మీదకు మరియు తన షాపు వద్దకు దాదాపు 30 నుంచి 35 మంది అనుచరులను తీసుకొని వెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరించడం జరిగింది. నీ అంతు చూస్తాం, నిన్ను వదిలిపెట్టం, అంటూ రౌడీలు గూండాలు లాగా చెలరేగిపోయారు. ఈ సంఘటనలను ఆడియో రికార్డు మరియు వీడియో రికార్డులను కూడా సేకరించడం జరిగింది, ప్రాణహాని ఉంది అని చెప్పి ఆధారాలతో సహా సింగరాయకొండ ఎస్సైకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎస్సై నుండి ఎటువంటి స్పందన రాలేదు. శనివారం పైస్థాయి అధికార అయినటువంటి సిఐని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. సిఐ పరిశీలించి విచారించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే పైస్థాయి అధికారులైన డిఎస్పి మరియు ఎస్పిల వద్దకు న్యాయం కోసం వెళ్తాము అని జనసేన నాయకులు తెలియజేశారు. సిఐని కలిసిన వారిలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, కాసుల శ్రీనివాస్, సయ్యద్ చాన్ బాషా, సంకె నాగరాజు, కేశవరావు తదితరులు ఉన్నారు.