అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో శ్రీమతి మాకినీడి శేషుకుమారి

మంగళగిరి, 8వ తారీఖున మంగళగిరి జనసేన పార్టీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో.. పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి. “// సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినది ఒక మహిళ //
ఈ సృష్టికి మూలకారణం స్త్రీ, స్త్రీ లేనిదే ప్రపంచం లేదు.
సహనం, దైర్యం,సాహసం వంటి ఎన్నో గొప్ప లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులను తీర్చిదిద్దే మహిళ. నేటి సమాజంలో మహిళలకు ఉన్నత స్థానం కల్పించి, స్త్రీలపై జరుగుతున్న టువంటి ఆకృత్యాలకు కట్టుదిట్టమైన చట్టాలను కఠినంగా అమలు చేసిన రోజే నిజమైన మహిళా దినోత్సవం.
రాబోయే రోజుల్లో అటువంటి మహిళా దినోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళా మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో.. జనసేన పార్టీ గోదావరి రీజనల్ కో-ఆర్డినేటర్ చల్లా లక్ష్మి, చిత్రాడ ఎంపిటిసి దూలపల్లి రత్నం, కందరాడ ఎంపీటీసీ పిల్లా సునీత, కేతినీడి గౌరీ నాగలక్ష్మి, పిల్లా రమ్య జ్యోతి, అనంతలక్ష్మి, సి.హెచ్ శిరీష పాల్గొన్నారు.