పోతిన మహేష్ సెటైరికల్ ట్వీట్

జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ చెడ్డి గ్యాంగ్‌కు విజ్ఞప్తి అంటూ ఓ సెటైర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో సంచరిస్తున్న చెడ్డి గ్యాంగ్ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు, సలహాదారుల ఇళ్లల్లో దోచుకోవాలి. నగర శివారుల్లోని పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లల్లో దోపిడీలు చేయడం సరికాదు. వైసీపీ నేతల ఇళ్లల్లో బోల్డంత డబ్బు ఉంది… వాటిని దోచుకోండి. ముఖ్యంగా మంత్రి వెల్లంపల్లి ఇంటిని దోచుకుంటే కోట్లాది రూపాయల డబ్బు లభిస్తుంది. వెల్లంపల్లి ఇంట్లో అన్ని 2 వేల నోట్ల కట్టలు బస్తాల్లో ఉన్నాయి. వెల్లంపల్లి ఇంటిలో అమ్మవారి రథానికి చెందిన మూడు సింహాల బొమ్మ దొరికితే చెట్టు తొర్రలో పెట్టి వెళ్లిపోండి. రాష్ట్రంలో అక్రమాలు.. దాడులు.. విధ్వంసాలు సృష్టించే వారిపై పోలీసులు కేసులు పెట్టడం లేదు. అలాగే దోపిడీలు చేసే చెడ్డీ గ్యాంగుల పైనా పోలీసులు కేసులు పెట్టరనే భావిస్తున్నా అని ట్వీట్ చేశారు.