శ్రీ బిపిన్ రావత్ కు శ్రద్దాంజలి ఘటించిన శ్రీనివాసరావుతోట జనసేన

త్రిదళాధిపతి … ధైర్యశాలి … యుద్ధ , దౌత్య వ్యూహకర్త … భరతమాత ముద్దుబిడ్డ జనరల్ శ్రీ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం దేశానికి, దేశ రక్షణకు తీరనిలోటు.

తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప దేశరక్షకుడు బిపిన్ రావత్. తన వ్యూహాలతో శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టించిన యుద్ధ ప్రవీణుడు బిపిన్ రావత్. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తెలుగుతల్లి కన్నబిడ్డ సాయి తేజ్ తో పాటూ అసువులు బాసిన సైనికులందరికి జనసేన పార్టీ తరుపున శిరస్సు వంచి కన్నీటితో శ్రద్దాంజలి ఘటిస్తున్నాం. శ్రీనివాసరావుతోటలోని జనసేన సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రద్దాంజలి ఘటించిన వారిలో రామిశెట్టి శ్రీను, కోనేటి ప్రసాద్, హేమంత్, దాసరి రాము, నండూరి స్వామి, గోపి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.