గ్రామ స్ధాయిలో జనసేన బలోపేతం

*పవనన్న ప్రజాబాట 87వరోజు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం గోవిందపురం పంచాయతీ నుకలాపు పేట గ్రామం ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు ఆధ్వర్యంలో ఇంటింటికి కార్యక్రమం వెళ్ళడం జరిగింది.

ఈ సందర్భంగా కరిమజ్జి మల్లీశ్వారావు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అలాగే గ్రామాల్లో వ్యవహరించాల్సిన తీరును ఆయన వివరించారు. మరియు గ్రామాల్లో పార్టీ యొక్క మేనిఫెస్టో, మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అందుకు త్వరలోనే మండలాల వారిగా గ్రామ పర్యటనకు శ్రీకారం చుడతామని ఆయన అన్నారు. అందేవిధంగా గ్రామ స్ధాయిలో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ జనసేనపార్టీ నాయకులు యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, మండల జనసేన నాయకులు పున్నాన పాలెం గ్రామ రామసోమునాయుడు పాల్గొన్నారు. పవనన్న ప్రజాబాట ప్రారంభించి 87వరోజు సుదీర్ఘంగా ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి మేనిఫెస్టో గురించి వివరించడం జరిగింది. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు ఈ కార్యక్రమంలో సోమినాయుడు, అప్పారావు, గౌరి నాయుడు, తిరుపతిరావు, గంగాధర్, గ్రామం పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.