రాబోయే కాలంలో ప్రతీ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురుతుంది -బండారు శ్రీనివాస్

  • మోదుకురులో ఘనంగా జనసేన జెండ ఆవిష్కరణ
  • జనసేనలో చేరిన ఇతర పార్టీల కార్యకర్తలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలం మోదుకురు గ్రామములో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆలమూరు మండల జనసైనికుల మధ్య కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇంఛార్జి బండారు శ్రీనివాస్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అన్ని నియోజకవర్గాలలో జనసేన జెండా ఎగరడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. జరగబోయే పాదయాత్ర కార్యక్రమం తప్పకుండా విజయవంతం చేసే బాధ్యత నియోజకవర్గ జనసైనికులు, వీరమహిళలదే అని పిలుపు ఇచ్చారు. అనంతరం సుమారు 100 మంది ఇతర పార్టీల నుండి జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడిజిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ డేవిడ్, సర్పంచ్ సంగీత సుభాష్, ఆలమూరు మండల జనసేన అధ్యక్షులు సురపురెడ్డి సత్య, సలాధి జయప్రకాశ్ నారాయణ (జెపీ), కొత్తపెళ్లి నగేష్, పడాల అమ్మిరాజు, యనమదల శ్రీనివాసరావు, నామాల సుబ్బారావు, నాగిరెడ్డి మహేష్, కుడుపూడి ప్రసాద్, దేశభక్తులు సత్యనారాయణ, రావూరి గణపతి, తారాటి తాతారావు, ఉండవెల్లి మనోజ్, జడ్డు నారాయణ రావు, రావూరి శ్రీనివాస్, అడపా రాఘవేంద్ర, దుప్పలపూడి గన్ని రాజు, మీసాలు నరేంద్ర, గునుమోలు సతీష్, గంటి లుదారి, శివకోటి వరప్రసాద్, బోగిరి రాములు, ఆకులు సురేష్, గొల్లవిల్లి పండు, జనపరెడ్డి సురేష్, రావూరి రమేష్, జడ్డు దుర్గారావు, దుప్పలపూడి దుర్గాప్రసాద్, దుప్పలపూడి సతీష్, ఖండవల్లి ప్రదీప్ జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.