రోడ్ల సమస్యలపై రెండవ రోజు గళమెత్తిన జనసేన జానీ

రహదారులు గోతులు జూన్ 15 నాటికి రోడ్లు పూర్తిచేస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం అందరికీ తెలిసిన విషయమే కానీ నేటి ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిని చుస్తే పల్లెల్లులో బురదలు టౌన్ లో అడుగుకి ఒక గుంత గొయ్యిలు కానీ పట్టించుకోని ప్రభుత్వం ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం అని ఈ వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రెండవ రోజు పాలకొండ నియోజకవర్గం పద్మపురం మల్లీవీడు బడ్డుమసింగి సింగుపురం వెళ్ళే మార్గమధ్య రహదారులులో గెడ్డవంతనే సగంపైగా కొట్టుకుపోయిన గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన జానీ మాట్లాడుతూ రోడ్లు సమస్యలపైన గలమెత్తారు. ఈ రహదారుల్లో ప్రయాణించాలంటే ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని ఈ గడ్డలో ఒక ఆవు పడి చనిపోవడం కూడా జరిగిందని.. దీనికి కారకులు స్థానిక నేతలు ప్రభుత్వ అధికారులునే.. అలాగే నీటి కోసం మూడు కిలోమీటర్ల దూరం మహిళలు ప్రయాణం చేయాల్సి వస్తుంది అని.. ఈ సమస్య పరిష్కారం పై అవసరమైతే కలెక్టర్ గారు దృష్టికి కూడా తీసుకువెళ్ళడానికి సిద్ధంగా రాజాపేట, బాసూరు యల్ యల్ పురం, కోటిపల్లి, పద్మాపురం, పాలకొండ నియోజవర్గ నాయుకులు, నియోజకవర్గ జనసైనికులు సిద్ధంగా ఉన్నారని జనసేన జానీ చెప్పడం జరిగింది. ఈ యొక్క రోడ్లు కుళాయి నీళ్లు సమస్యను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మరియు ఇప్పుడు ఉన్న వైసిపి ప్రభుత్వం మరియు గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేసిన తప్పిదాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. చుట్టు ప్రక్కల గ్రామాలకు ఆరోడ్డు పైన వెళ్ళి రావడం ప్రజలు గర్భిణీ స్త్రీలును హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అంటే భయంతో అక్కడిక్కడే మధ్యలోనే డిలవరీ అయ్యే పరిస్ధితులు ఉన్నాయని.. ఈ అన్యాయాన్ని జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది అని.. ఈ రోడ్లు సమస్యను ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు నిర్మాణాన్ని పూర్తి చేస్తారని జనసేన జానీ కోరడమైనది. పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా జనసేన జానీ తెలియపరచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రాజపేట, బాసూరు, యల్ యల్ పురం, కోటిపల్లి, పద్మపురం జనసైనికులు, మహిళలు, వృద్దులు, పాల్గొనడం జరిగింది.