జనసేన ఆదుకుంది

•ప్రభుత్వం నుంచి ఫించన్ కూడా మంజూరు కాలేదు
•జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీ దాకారపు కొండలు కుటుంబం ఆవేదన
•పార్టీ తరఫున రూ. 5 లక్షల చెక్కు అందచేసిన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

‘గత ఏప్రిల్ నెలలో ద్విచక్ర వాహనానికి గొర్రె అడ్డొచ్చి ప్రమాదం జరిగింది.. ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.. కూలి చేసుకుంటేనే గాని పూట గడవని పరిస్థితి. అయినా ప్రభుత్వం నుంచి ఎవ్వరూ కనికరం చూపలేదు. ఆయన ఆసుపత్రిలో ఉండగానూ.. చనిపోయిన తర్వాత కూడా జనసేన కార్యకర్తలే మా కుటుంబానికి అండగా నిలిచారు. కష్టంలో ఉన్నామంటే వారికి తోచిన ఆర్ధిక సాయం చేశారు’… ఇది కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం, కొత్తపల్లికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ దాకారపు కొండలు భార్య శ్రీమతి మణి ఆవేదన. రోడ్డు ప్రమాదంలో శ్రీ దాకారపు కొండలు మృతి చెందగా., మంగళవారం పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అతని కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున క్రియాశీలక సభ్యులకు ఇచ్చే రూ. 5 లక్షల చెక్కును శ్రీ కొండలు భార్యకు అందచేశారు. పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా స్వీకరించి నిరంతరం వారి శ్రేయస్సు కోరుకునే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని, పార్టీ తరఫున అన్ని రకాలుగా వారికి అండగా ఉంటామని భరోసా నింపారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారికి తన బాధలు చెప్పుకున్నారు. ‘ముగ్గురు ఆడ బిడ్డలు.. పెద్ద కుమార్తె మానసికంగా ఎదగలేదు.. ఇలాంటి పరిస్థితుల మధ్య భర్త చనిపోయి ఏడు నెలలు గడచినా కనీసం వితంతు ఫించన్ కూడా మంజూరు కాలేద’ని వాపోయారు. ఆమెకు త్వరగా ఫించన్ వచ్చేలా అధికార యంత్రాంగంతో మాట్లాడాలని శ్రీ మనోహర్ గారు స్థానిక నాయకులకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీమతి బట్టు లీలా కనకదుర్గ, పార్టీ నాయకులు శ్రీ బండి రామకృష్ణ, శ్రీ బి.వి.రావు. శ్రీ నల్లగోపుల చలపతి, శ్రీ సిరిపురపు రాజబాబు, శ్రీ వర్రే హనుమాన్ ప్రసాద్, శ్రీ కొల్లి బాబి, శ్రీ వీరంకి వెంకటేశ్వర రావు, శ్రీ నానాజీ, కైకలూరు నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల అధ్యక్షులు, జిల్లా, మండల కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.
•కృష్ణా జిల్లావ్యాప్తంగా ఘన స్వాగతం
కృష్ణా జిల్లాలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఆర్ధిక భరోసా నింపేందుకు వచ్చిన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి పార్టీ శ్రేణులు అడుగడుగునా ఘనస్వాగతం పలికాయి. విజయవాడ నుంచి బయలుదేరిన శ్రీ మనోహర్ గారికి పామర్రు నియోజకవర్గం పరిధిలో కరకట్ట మీద గజమాలలతో స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అడుగు పెట్టగానే భారీ ఎత్తున బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా ఆడపడుచులు హారతులు పట్టగా పెడన, కైకలూరు నియోజకవర్గాల్లోనూ భారీ గజమాలలతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *