అవనిగడ్డలో జనం కోసం జనసేన 10వ రోజు

అవనిగడ్డ నియోజకవర్గం: జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన 10వ రోజు కార్యక్రమాన్ని అవనిగడ్డ లోని 4వ వార్డ్ నందు సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు, అవనిగడ్డ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి అన్నపరెడ్డి ఏసుబాబు ముఖ్య అతిథులుగా అవనిగడ్డ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీహరి, మరియు అవనిగడ్డ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి భోగిరెడ్డి నాగేశ్వరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ జనసేన పార్టీ టౌన్ కమిటీ సభ్యులు మరియు వీరమహిళలు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.