వై. కోట టీమ్ ఆధ్వర్యంలో జనసేన నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ

ఉమ్మడి కడపజిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జనసేన పార్టీ వై. కోట టీమ్ ఆధ్వర్యంలో 2023 జనసేన పార్టీ క్యాలెండర్ ను రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరియు నియోజకవర్గ సీనియర్ నాయకులు, యువత, చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.. ఈ ఆవిష్కరణ కార్యక్రమం పార్టీ ష్రెణుల మధ్య కన్నుల పండుగగా జరిగింది. కాలండర్ లో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్దాంతాలను పొందుపరచి అద్భుతంగా రూపొందించారు.. జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను, పార్టీ అధ్యక్షులు వారి లక్ష్యాలను పలు విధాలుగా వివరిస్తూ పామరులను సైతం కదిలిస్తూ తయారు చేయబడిన ఈ క్యాలెండర్ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి అండగా ఉంటుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో వై కోట టీమ్ సభ్యులు వై కోట టీం జనసేన సభ్యులు చవాకుల రెడ్డి మణి, నల్లంశెట్టి కిషోర్, ఆలం నాగభూషణం, వై కోట టీం ఎన్నారై సభ్యులు కొమ్మినేని బాలాజీ, కొండేటి మనోజ్, అల్లం శ్రీనివాసులు, పి సుబ్రహ్మణ్యం, ఎర్ర నాగేష్, నల్లంశెట్టి నాగరాజు, మల్లెం అజయ్, గంధంశెట్టి దినకర్ బాబు, ముత్యాల కిషోర్, ముద్దపోలు సభాపతి, రామసుబ్బయ్య, పగడాల మణీ, అంకి శెట్టి మణి, ఉత్తరాది శివ, నగరిపాటి మహేష్, సవరం సాయి, శంకరయ్య, వరికుట్టి నాగరాజు, పగడాల చంద్రశేఖర్, వీరేంద్ర, గిరి, పోతులూరి నరేంద్ర మొదలగు వారు పాల్గొన్నారు.