చల్లపల్లి రహదారి బంగళాలో రహదారి, ఫెన్సింగ్ పాడుచేసినవారిపై చర్యలు తీసుకోవాలి.. జనసేన పార్టీ

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం, చల్లపల్లి గ్రామంలో ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన రహదారి బంగళాలో ఒకప్పుడు, మంత్రులు, అధికారులు బస చేసేవారు. అయితే ఇప్పుడు అది పూర్తిగా పాడైపోయి, గబ్బిలాలు నివాసం ఉంటున్నాయి. ఈ రహదారి బంగళా ఇప్పుడు అక్రమాదారులకు అడ్డాగా మారిపోయింది. గత 20 రోజులు నుండి కొంతమంది బంగళా గేటు తాళం పగలకొట్టి, రహదారి బంగళాకు ఉన్న పెన్షింగ్ పోల్స్ పికివేసి, సుమారు 3 అడుగుల లోతులో కాంక్రీట్ వేచిన పోల్స్ జేసీబీతో తొలిగించి బుసక తోలటం, రహదారి బంగాళాలో బుసక డంపింగ్ చేయటం చూస్తుంటే, అసలు అధికారులు ఉన్నారా లేరా అని అనిపిస్తుంది. ప్రక్కనే ఎం.ఆర్.ఓ, ఎం.డి.ఓ ఆఫీస్ లు ఉన్నాయి. అయినా ఇలా ప్రభుత్వం స్థలం పాడుచేస్తున్నా.. చూస్తూ ఊరుకోవటం చాలా బాధాకరం. జనసేన పార్టీ తరపున గురువారం రహదారి బంగ్లా ను జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారప్రతినిది రాయపూడి వేణుగోపాల్ పరిశీలించటం జరిగింది. ఈ రహదారి బంగ్లా కబ్జాకు కుడా గురైనట్టు అర్ధమవ్వగా.. సదరు విషయం ఆర్ & బి అదికారిని కలిసి జరిగిన విషయం చెప్పటం జరిగింది. అలాగే రైట్ అఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం స్థలం వివరాలు అడగటం జరిగింది. ఆమె వెంటనే స్పందించి బంగాళాకు సంబదించిన వివరాలు ఇస్తాం అన్నారు. ప్రభుత్వం ఆస్తిని పాడుచేసినవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిది రాయపూడి వేణుగోపాల్ రావు, జనసేన నాయకుడు రవి కుమార్ మరియు స్థానికులు పాల్గొన్నారు.