ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 23వ రోజు పాదయాత్ర

ఏలూరు, స్థానిక 3వ డివిజన్ సత్యనారాయణ పేటలో రెడ్డి అప్పల నాయుడు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కార్పోరేటర్ ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి తన పదవిని కేవలం అలంకరణ కోసం అనుభవిస్తున్న నాయకులు కనీసం డ్రైనేజీ తీయించకపోవడం, చెత్తపై పన్ను విధించడం సంక్షేమ పథకాలు సరైన రీతిలో అందించకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని రెడ్డి అప్పల నాయుడు విమర్శించారు. ఏలూరు కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి గురించి సొంత పార్టీ కార్పోరేటర్ నిరశన వ్యక్తం చేస్తుంటే కనీసం స్పందన లేకుండా ఏలూరు శాసనసభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కేవలం సంక్షేమ పథకాల మీద ఉన్న దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద పెడితే ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అవుతుంది. కానీ జగన్ మోహన్ రెడ్డి తన సొంత స్వలాభం వ్యాపార అభివృద్ధి కోసం కేవలం ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని రెడ్డి అప్పల నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, ఉపాధ్యక్షుడు బొత్స మధు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యులు బోండా రాము నాయుడు, అల్లు సాయి చరణ్ తేజ్, కార్యనిర్వహక కార్యదర్శి గొడవర్తి నవీన్, స్థానిక నాయకులు నిమ్మల ఈశ్వరరావు, బొద్దాపు గోవిందు, నిమ్మల శ్రీనివాసరావు, కందుకూరి ఈశ్వరరావు, శ్రీనివాసు, పవనిజం పండు, మీసాల రమణ, నాగరాజు,ఆబోతుల మధు,ఆబోతుల రవి, వీరమహిళ కావూరి వాణి, సుజాత, ఉమా దుర్గా తదితరులు పాల్గొన్నారు.