జనసేనాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి: శెట్టిబత్తుల

  • జనసేనలో చేరిన ఎస్.యానం గ్రామానికి చెందిన అగ్నికుల క్షత్రియ యువకులు

కోనసీమ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు, అమలాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్ణయించింది. అమలాపురం ప్రెస్ క్లబ్ భవన్ లో ఆదివారం జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజబాబు మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీ శుక్రవారం నాడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా1 వ తేదీన స్థానిక ముస్లిం షాధీఖానాలో ఏర్పాటు చేసిన స్వచ్చంద రక్తదాన శిభిరంలో జనసైనికులు పెద్ద ఎత్తున రక్తదానం చేస్తారని, తర్వాత 2వ తేదీన అమలాపురం పట్టణం మొదలుకొని అల్లవరం, ఉప్పలగుప్తం, అమలాపురం రూరల్ మండలాలలో జనసైనికులు ఏర్పాటు చేసిన వివిధ సేవా కార్యక్రమాలతో బాటు జనసేన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం నా వంతు” అనే శీర్షికతో ఏర్పాటు చేసిన క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేసారు. ఈ సమావేశంలో ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం గ్రామానికి చెందిన అగ్నికుల క్షత్రియ యువకులు పెద్ద సంఖ్యలో రాజబాబు సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరిని రాజబాబు పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో రాష్ర్టకార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి మహాదశ నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ నాయకులు సందాడి శ్రీనుబాబు, చిక్కాల సతీష్, చిక్కం భీముడు, కౌన్సిలర్లు పిండి అమరావతి, గండి దేవి హారిక స్వామి, గొలకోటి విజయలక్ష్మీ వాసు, ఎమ్.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్ కంకిపాటి వీరబాబు, నియోజకవర్గ సీనియర్ నాయకులు సూదా చిన్న, ఆకులబుజ్జి, తాళ్ళ రవి, ముత్తాబత్తుల శ్రీను, వీర మహిళలు చిక్కం సుధ సూర్యమోహన్, ముత్యాల మణి, చాట్ల మంగతాయారు జనసైనికులు పాల్గొన్నారు.