48 వేల కోట్లకు లెక్కలు లేవు. ఇది వైసిపి ప్రభుత్వ ఆర్థిక అరాచకం కాదా?

పెడన, శాసనసభ ఆమోదం లేకుండానే 98 వేల కోట్లు ఖర్చు. 48 వేల కోట్లకు ఎలాంటి బిల్లులు లేవు. పరిస్థితులను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాళా దిశగా అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆర్థిక శాఖలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలకు అర్థం కాని కాకి లెక్కలతో బడ్జెట్లో అంకెల గారడి చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.

48 వేల కోట్లు చెల్లింపుల జాడలేదు. వైసీపీ ప్రభుత్వ అధికారం చేపట్టినా నాటినుండి బిల్లుల చెల్లింపులో తీవ్ర గందరగోళం నెలకొంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు లేవు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల బిల్లులు చెల్లించలేదని ఆందోళన చేపడుతున్నారు. విద్య, వైద్యం పై కేటాయింపుల శూన్యం. నాడు నేడు పనుల బిల్లలు ఇప్పటికీ రాలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చెల్లింపు లేని కారణంగా ప్రభుత్వ టెండర్లకు ముందుకు రాని గుత్తేదారులు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయాలు, ఆర్.బి కేంద్రాల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లకు (స్థానిక నాయకులకు) ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని గుర్రుగా ఉన్నారు. చేసిన పనికి బిల్లుల చెల్లింపు లేదు. ఖర్చుగా చూపిస్తున్న 48 వేల కోట్లకు సరైన బిల్లులు లేవు. మధ్యం అమ్మకపోతే ప్రభుత్వాన్ని నడపలేము అని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం వైసిపి ప్రభుత్వ ఆర్థిక వైఫల్యానికి అద్దం పడుతుంది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతారని పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు అన్నారు.