కాపు నేస్తం అంటూనే కాపు కి ద్రోహం చేస్తున్న పెద్ద నాయకుడు

*కాపు అంటే అర్థం (రక్షించు, కాపాడు, కాపుకాయువారు)

*కాపుకు ద్రోహం చేసే వాళ్ళు, దేశద్రోహుల కంటే ప్రమాధకరమయిన వారు

*పేరులోనే గొప్పదనం కలిగి, మానవత్వపు పరిమళాన్ని ప్రపంచమంతా వెదజల్లుతూ, సంస్కారం అనే సంపదను కలిగి, అన్ని కులాలను సమానంగా చూసే ఔదార్యం కలిగినవారు కాపులు

*ఓట్లకోసం, అధికారం కోసం, కొద్దిమంది కాపులకు పదవులు ఎరగా చూపి పబ్బం గడుపుకొని శుష్కవాగ్ధానాలతో మభ్యపెట్టి, సొంతవాళ్ళమధ్య చిచ్చు పెట్టి, వేడుక చూస్తున్న మీ చిల్లర రాజకీయాలను కాపులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నాం

*ఏ పార్టీ అధికారంలోకి రావాలి అన్నా, మీలో ఒకరిని కుర్చీలో కూర్చోబెట్టటానికి.. కుర్చీ కున్న నాలుగు కాళ్ళు నలుగురు కాపులు మోస్తూ.. జీవితమంతా మీఎదుగుదలకు పాకులాడే నిస్వార్థులు కాపులు.

*ఒక్కసారి కాపులు అందరూ ఏకము ఐతే చరిత్ర తిరగ రాయవలసిందే!

*అందరూ బాగుండాలి అని, ప్రతీఒక్కరికీ మద్దతు పలికి, మిమ్మల్ని కుర్చీ మీద కూర్చోబెడుతుంటే.. మీరు కాపులకే పంగనామాలు పెట్టాలని చూస్తున్నారు.

*అధికారం కోసం,కాపులు కన్నెర్రజేస్తే.. చరిత్ర తిరగ రాస్తారు.

*మిమ్మల్ని ఉద్ధరించాలని కొందరు మా సామాజిక వర్గానికి చెందినవారు మీకు కొమ్ముకాస్తూ, మీకున్యాయం చేయటానికి సొంతోళ్లకి అన్యాయంచేసి చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారు. క్షమించరాని నేరం చేస్తున్నారు.

*ఇన్నిరోజులు అధికారం అవసరం లేదని, అందరూ బాగుండాలి అందులో మనమూవుండాలి అని కాపులు అనుకున్నారు.. కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి.

*కాపులను మభ్యపెట్టి, వారికి రావలసిన నిధులను సక్రమంగా ఇవ్వకపోగా.. కాపులను నోటికొచ్చినట్లు తూలనాడి, కాపు ద్రోహులుగా మిగిలిపోయారు నేటి పాలకులు.

*అందుకే కాపు సక్రమంగా ఆలోచిస్తే మీ అధికారం ఎక్కడ చేజారుతుందో అనే భయంతో, కాపులు అమ్ముడు బోయే వారుగా చిత్రీకరిస్తున్నారు. పదునయిన మాటలతో రెచ్చగొడుతున్న మీకు సమాధానం 2024 లో కచ్చితంగా ఇస్తాము. మా కాపునే అధికారం లోకి తెచ్చి మా పౌరుషాన్ని నిలబెట్టుకుంటాం.


*కాపు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగునాట ప్రముఖమయిన సామాజిక వర్గము.

*ఏ పార్టీ మనుగడ సాగించాలన్న కాపులు ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు.
ఎవరు అవునన్నా.. కాదన్నా రాబోవురోజుల్లో అధికారం కాపులదే! ఇది పక్కా

*అన్ని కులాల్ని, మతాలని కలుపుకొని కుల, మత సామరస్య సంగమంతో ప్రజా ఆమోగ్య ప్రభుత్వం స్థాపించే వరకు అలుపెరుగని పోరాటం చేస్తాం.

పవన్ కళ్యాణ్ గారి మీద ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ తరపున దారం అనిత చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన నాయకులు రెడ్డి, గిడ్డు, ప్రసన్న, మురళి, షాబుద్దీన్, ఆసిఫ్ మరియు నరసింహ డిమాండ్ చేసారు.