ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజా స్వేచ్ఛను అణచివేస్తుంది

  • అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. గంగులయ్య

పాడేరు నియోజకవర్గం: అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కూడలిలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసన వ్య క్తం చేసిన తెదేపా శ్రేణులు మద్దతు తెలిపిన జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. గంగులయ్య పాడేరు మండల జనసేన పార్టీ నాయకులు. ఈ సందర్బంగా గంగులయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకలిస్తూ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది రాష్ట్రాన్ని మరో బీహార్ గా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఉన్నరేమో ముఖ్యమంత్రిగారు తాను జైలు జీవితం అనుభవించాను కాబట్టి ప్రశ్నించే ప్రతివారిని జైలులో వేయాలని ఆలోచన చేసినట్టున్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం, విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ గారు స్థిరభిప్రాయంతో వున్నారు. సోమవారం జనసేనాని ఆదేశాల మేరకు తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న బంద్ కు అల్లూరిజిల్లా జనసేన పార్టీ నాయకులందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఒకవైపు సెక్షన్ 144 ద్వారా నాయకులను గృహానిర్బంధం చేస్తూ నిరసన వ్యక్తం చేయడానికూడా హక్కు లేదనే విదంగా పార్టీ శ్రేణులను, కార్యకర్తలను నిర్బంధించే విధానం సరికాదన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజా స్వేచ్ఛను అణచివేసే విధానాలను అవలంబిస్తుందని, కాబట్టి విముక్తఆంధ్రప్రదేశ్ కావాలని అందుకు నిర్విరామంగా కృషిచేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జనసేనపార్టీ శ్రేణులందరికి తెదేపా పార్టీ శ్రేణులు నిరసనకు మద్దతు మనవంతు సహకారాం అందించాలన్నారు. అందుకే మేము మద్దతు తెలుపుతున్నామని పోలీస్ వ్యవస్థను తమ నియంతృత్వ విధానాలకు ఉపయోగించడం లా అండ్ ఆర్డర్ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్టేనని అన్నారు. ఈ నిరసనలో పాల్గొన్న జనసేన అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ గంగులయ్య వంపూరు, దివ్యలత, కమల్ హాసన్, మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, తల్లే కృష్ణ జనసైనికులు, టీడీపీ నేతలు ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి, వంజంగి కాంతమ్మ, కిల్లో బొంజుబాబు, తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.