కులాలను కలిపేవిధానం సిద్ధాంతంతో సమావేశం

  • ఎచ్చెర్లలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా మొదటిరోజు జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతం అయినటువంటి కులాలను కలిపే ఆలోచనలో భాగంగా శుక్రవారం సాయంత్రం గోవిందపురం పంచాయితీ భరిణికాం గ్రామంలో జరిగినటువంటి కులాలకు అతీతంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ మాట్లాడుతూ జనసేన పార్టీకి కులాలు మతాలు ఉండవని ప్రజలందరూ సమానమని వివరించి చెప్పడం జరిగింది. ఇది విన్న ఆ గ్రామ ప్రజలు ఎన్నో పార్టీలను చూసాం కానీ ఇటువంటి గొప్ప ఆలోచనలు కలిగిన పార్టీకి మేమంతా వెంట ఉంటామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాజేష్, బాబాజీ, కోటి, గొల్లబాబు, నీలం నాయుడు, ధర్మ, శ్రీను, పవన్, నాయుడు అసిరి నాయుడు, శ్రీను మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.