బెల్లం కొనుగోలుకి ఆధార్ కార్డా?

పెడన, నిత్యావసర వస్తువైనా బెల్లం కొనాలి అంటే ఆధార్ కార్డు చూపించవలసిన పరిస్థితి. ఇటు వినియోగదారుడు, అటు వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు. శుభకార్యాలకు, పండగలకు, దైవకార్యాలకు బెల్లం ఎక్కువగా వినియోగిస్తుంటారు. అంతేకాకుండా ఆక్వా రైతులు కూడా ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం కోసం బెల్లాన్ని వాడుతుంటారు. బెల్లంపై ఆంక్షలు ఉండటం వల్ల ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో వ్యాపారస్తుడు బెల్లం విక్రయ వివాదంలో ఆత్మహత్య చేసుకున్న విషయం విధేయతమే. కాపుసారా అరికట్టుటకు తీసుకుంటున్న చర్యలు హర్షించదగ్గవే. వినియోగదారులు, వ్యాపారస్తుల విజ్ఞప్తిలను దృష్టిలో పెట్టుకొని బెల్లంపై ఆంక్షలు ఎత్తివేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.