రాయచోటి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

అన్నమయ్య జిల్లా, రాయచోటి, రాయచోటి పట్టణ కేంద్రం జనసేనపార్టీ కార్యాలయ సెక్రటరీ షేక్ రియాజ్ నేతృత్వంలో రాయచోటి అసెంబ్లీ ఇంఛార్జ్ షేక్ హాసన్ బాషా ఆదేశాల మేరకు ఏపిజె అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి డా.ఏపిజె అబ్దుల్ కలాం జన్మదినం పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ… మన భారత దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మన దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ… ఆయన స్పూర్తిని గుండెల్లో నింపుకొని భావి భవిష్యత్తు తరాలకు బాసటగా అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం జనసైనికులు సమక్షంలో కలామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్, షేక్ రియాజ్, ఖాదర్ బాషా, అర్ఫాద్ అమీర్, సుభాహన్, అఫ్రీద్, సుహెబ్, ఖాన్, రిక్షా ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.