Kakinada: జీవో నెంబర్ 35 &42 రద్దు చెయ్యాలి… జిల్లా కన్వీనర్ అరుణ్ కుమార్..!

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకినాడ శాఖ డిమాండ్… జీవో నెంబర్ 35 & 42 రద్దు చెయ్యాలి

జిల్లా కన్వీనర్ అరుణ్ కుమార్..!!

కాకినాడ జనసేన: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఐడియల్ కళాశాల ఎదురుగా ధర్నా. అనంతపురం SSBN కళాశాలలో ఎయిడెడ్ విద్యాసంస్థల పరిరక్షణకై బయటకు వచ్చి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థినీ విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జిలను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తుంది. ఎంతో మంది మహానుభావులు కట్టించిన విద్యా సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి అనేక కుట్రలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి యొక్క పనితీరును వ్యతిరేకిస్తూ విద్యార్థులు స్వతహాగా బయటకు వచ్చి శాంతియుతంగా నిరసన చేస్తే ప్రశ్నించే గొంతును నొక్కుతూ వాళ్లపై దౌర్జన్యంగా లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేస్తూ విద్యార్థులను భయానికి గురి చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరు పూర్తిగా హాస్యాస్పదం అయినది మరియు కుట్రపూరితమైనది. రాజకీయ స్వార్థం కోసం స్వలాభం కోసం ఎయిడెడ్ వ్యవస్థను నాశనం చేయడానికి తీసుకొచ్చిన జీవో నెంబర్ 35, 42లను రద్దు చేయాలి. స్వాతంత్రం రాక ముందు ఎంతో మంది మహానుభావులు పేద మధ్య బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలని ఉద్దేశంతో ఎయిడెడ్ కళాశాల క్యాంపస్లు నిర్మించి వాటికి సంబంధించిన స్థలాలు ఉచితంగా కేటాయించి ఎయిడెడ్ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి తీసుకువచ్చిన జీవో నెంబర్ 42 అనేది విద్యార్థుల విద్యా వ్యవస్థపట్ల శాపంగా మారుతూ ఎక్కువ ఫీజులతో విద్యార్థులపై గుదిబండగా మారే అవకాశం ఉంది. జీవో నెంబర్ 42 ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దుచేసి విద్యను దానం చేసిన మహానుభావుల ఆశయాలను కాపాడలని, లేదంటే ఆ విద్యాసంస్థలను పూర్తిగా ప్రభుత్వమే నడపాలని, ఎయిడెడ్ విద్యాసంస్థలు యుజిసి మరియు RUSA నిధులతో నడుస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని అని ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రైవేటు పరమైతే ఫీజులు పెరగడంతోపాటు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వంపై అధిక భారం పడుతుందని ఈ సందర్భంగా తమరికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లెక్చరర్ పోస్టులను భర్తీ చేయకుండా తీసుకువచ్చిన జీవో నెంబర్ 35 రద్దుచేసి యధావిధిగా లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని లేదా మహారాష్ట్ర కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సర్వీస్ కమిషన్ ద్వారా అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని ఉన్నత నాణ్యత ప్రమాణాలు ఉండాలంటే లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాల్సిందేనని తెలియజేయడం జరుగుతుంది. వెంటనే జీవో నెంబర్ 35 & 42 రద్దు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకినాడ శాఖ డిమాండ్ చేస్తూ కాకినాడ ఐడియల్ కళాశాల ఎదురుగా ధర్నా కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అరుణ్ కుమార్, శివ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.