విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ఎంపీలందరూ రాజ్యసభలో పోరాటం చేయాలి

-అమలాపురం పార్లమెంట్ ఇన్చార్జ్ డిఎంఆర్ శేఖర్.
-జనసేన కొత్తపేట ఇన్చార్జ్ బండారు శ్రీనివాసు,

ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు అందరు పార్లమెంట్ లోను, రాజ్యసభలోను తమ బలమైన గళాన్ని వినిపించి విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు పోరాటం చేయాలని జనసేన కొత్తపేట ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, అమలాపురం పార్లమెంట్ ఇన్చార్జ్ డిఎంఆర్ శేఖర్ అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడురోజుల పాటు డిజిటల్ క్యాంపైన్ నిర్వహించాలని ఆదేశిన్చారని అందులో భాగంగా మూడోరోజు పురస్కరించుకొని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను పార్లమెంట్లో వ్యతిరేకించాలని అమలాపురం ఎంపీ చింతా అనురాధని కోరుతూ ఆలమూరు మండలం జొన్నాడ సెంటర్ వద్ద జనసేన మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య ఆధ్వర్యంలో జనసేనపార్టీ కొత్తపేట ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, పార్లమెంట్ ఇన్చార్జ్ డిఎంఆర్ శేఖర్, జనసేన నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబుజగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమావేసి అక్కడి నుండి జనసేన కార్యకర్తలతో ర్యాలీగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బండారు శ్రీనివాస్, డిఎంఆర్ శేఖర్ లు మాట్లాడుతూ ముందుగా వైకాపా ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా పోరాటం చేయాలని కోరారు. అందరికన్నా ఎక్కువ బాధ్యత వైకాపా ఎంపీలపైనే ఉందని, ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. పార్లమెంట్ లో ఫ్లకార్డులు ప్రదర్శించి పోరాటం చేయాలని సూచించారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎంతో మంది చేసిన పోరాటాలను, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. స్దానిక అమలాపురం వైసిపి పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ పార్లమెంట్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డు ప్రదర్శన చేయాలని డిజిటల్ క్యాంప్ ద్వారా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, కార్యదర్శి సంగీత సుభాస్, ఎంపీటీసి సభ్యులు తమ్మన భాస్కరరావు, తాతాజీ, జాంపోలు నాగేశ్వరరావు, మూలస్థానం సర్పంచ్ లంక వరప్రకాష్ రావు, వైస్ సర్పంచ్ సాయికిరణ్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు చింతలపూడి శ్రీనివాసు, నామాల సుబ్బారావు, పాలూరి అర్జున్, దేసాబత్తుల సత్యనారాయణ, కట్టారాజు, వీరమహిళ కోట వరలక్ష్మి జనసేన నాయకులు సలాది జయప్రకాష్ నారాయణ(జెపి), ఉండమట్ల బాలక్రిష్ణ, పడాల అమ్మిరాజు, వనచర్ల ధనరాజ్, నాగిరెడ్డి మహేష్, కొనగోళ్ళ ధనరాజ్ నాయుడు, బైరిశెట్టి రాంబాబు, తోరాటి తాతారావు, ప్రేమ్ కుమార్, భావన శివ, పల్ల శ్రీను, సోము గంగాధరం, వానపల్లి శ్రీను, మద్దిరెడ్డి బాల, కలిదిండి బాలక్రిష్ణ, ఎరుబండి ప్రసాద్, తమ్మన ఏసుబాబు, కొత్తపల్లి శివ, పల్ల సాయి, మద్ది దుర్గాప్రసాద్, మద్దరెడ్డి శివ, చావంకూరి శ్రీను, బాలు, మహీ అధిక సంఖ్యలో జనసైనికులు అభిమానులు పాల్గోన్నారు.