వైసిపి నాయకుల్లారా పద్ధతి మార్చుకొని జాగ్రత్తగా మాట్లాడండి

రాష్ట్రంలో ప్రజల కోసం తన సొంత డబ్బుని ఇచ్చి ఆదుకునే నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ ను సిబిఎన్ దత్తపుత్రుడు అంటే జగన్ ను జైలు రెడ్డి, సి.బి.ఐ దత్తపుత్రుడు, చంచల్గూడా షటిల్ టీం ముఠా నాయకుడు అనాల్సి ఉంటుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరికీ దత్తపుత్రుడు కాదు… ప్రజల దత్తపుత్రుడు… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసిపి నాయకుల్లారా పద్ధతి మార్చుకొని, జాగ్రత్తగా మాట్లాడండి. అధికారంలో ఉన్నారు చేతనైతే ప్రజలకు మంచి చేయండి. జనసేన నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ గూడూరు జనసేనపార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి ఆత్మహత్యలు చేసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి లక్షరూపాయల వంతున మొత్తం 30 కోట్లు ఇస్తుంటే అభినందించాల్సింది పోయి జనసేనాని మీద పడి ఏడవడం చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి చేతకాని తనానికి, అసహనానికి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. జనసేనపార్టీ ద్వారా ఇప్పటి వరకు 200 మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం జరిగిందని, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది అన్నీ వ్యవస్థలు చేతిలో ఉన్నా, చనిపోయిన వాళ్లు రైతులో కాదో తెలియని స్థితిలో ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను చూపడానికి మీ లాగా, మా నాయకుడు “ఆత్మలతో” మాట్లాడేవారు కాదని, జనసేనపార్టీ ఆర్థికసాయం అందించిన వారి వివరాలు పోలీసు రికార్డ్స్ లో ఏమి రాసి ఉన్నాయో చూపిస్తామని, అలాగే ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను విచారిస్తే వారు రైతుల్లో కాదో తెలుస్తుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 7 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల కోసం వైసీపీ తెచ్చిన చట్టం వల్ల, అలాగే కౌలు రైతు కార్డులు ఇవ్వకపోవడం తో కౌలురైతులకు రుణాలు, బీమా సదుపాయం అందడం లేదన్నారు. అలాగే రైతులను కులలవారిగా విభజించి లబ్ది చేకూర్చాలని చేసిన నిబంధనను తొలగించడంతో పాటు వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు పెట్టె ఆలోచనను విరమించుకోవలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు ఇంద్ర, స్వరూప్, సనత్, వసంత్, సాయి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.