ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి

ఏపీ రెండు రోజుల క్రితo రామచంద్రమూర్తి ప్రభుత్వ సలహాదారుగా రాజీనామా చెయ్యగా ఆంధ్ర ప్రదేశ్ లో మరో సలహాదారుని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డి వ్యవసాయానికి సంబంధించిన అంశాలలో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు సలహాదారుగా నియమించింది.

అంబటి కృష్ణారెడ్డి క్యాబినెట్ ర్యాంక్ కలిగి ఉంటారు.రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.అంబటి కృష్ణారెడ్డికి వేతనము, అలవెన్సులు, వాహనం ఖర్చులు, ఇంటి అద్దె తదితరాలు, సెక్యూరిటీ అన్నీ మంత్రులకు ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని వసతులను కల్పించనున్నారు. దీనికోసం ఆయనకు నెలకు 80 వేల చొప్పున చెల్లించనున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఆయన కారు కొనుక్కోడానికి పదిలక్షల లోన్ లేదా అడ్వాన్స్ ను ప్రభుత్వం ఇవ్వనుంది . కంప్యూటర్ కొనుగోలు కోసం, ఫర్నిచర్ కొనుగోలు కోసం, ఇతర సామాన్లు కొనుగోలు కోసం కూడా ఆయనకు లోన్ సదుపాయాన్ని అందించనున్నారు. ప్రభుత్వం తరఫున 2 ఫోన్ కనెక్షన్లు కూడా అందిస్తారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటివరకు ప్రభుత్వానికి సలహాదారులుగా ఇప్పటికి 33 మందిని నియమించారు. వీరిలో పదిమందికి క్యాబినెట్ హోదా కూడా ఉంది.ఇటీవల ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారు రామచంద్రమూర్తి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.