సత్తెనపల్లి నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతుంది: గాదె

సత్తెనపల్లి నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతుందని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. రెంటపాళ్ళ యూనియన్ బ్యాంక్ ఘటనపై ఆయన స్పందిస్తూ.. ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగిస్తుందో రెంటపాళ్ళ యూనియన్ బ్యాంక్ ఘటనే ఉదాహరణ.. ఘటన జరిగి 20 రోజలు గడుస్తున్నా బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఈ ఘటన మీద నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అంబటి ఇప్పటివరకు స్పందించలేదు. పోలీసులను పెట్టి ప్రతిపక్షాల ను అడ్డుకుంటున్నారు. మంత్రి అంబటి కి గోల్డ్ గోల్మాల్ వ్యవహారంలో హస్తం వుంది. గోల్డ్ అప్రైజర్ సంపత్ మొన్న జరిగిన సంక్రాంతి సంబరాల్లో నక్లెస్ బహుమతిగా ఇచ్చాడు. గోల్డ్ అప్రెజర్ సంపత్ కుమార్ అంబటి అనుచరుడు. మంత్రి అంబటి నిదితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. నియోజకవర్గం ఇంత జరిగిన ఇప్పటివరకు భాధితులను కలిసి పరామర్శించలేదు. రాష్ట్రంలో ధుర్మార్గపు పాలన సాగిస్తున్నారు. యూనియన్ బ్యాంక్ లో జరిగిన స్కామ్ లో పూర్తి స్థాయి విచారణ చేయకుండా పోలీసులు తత్సరం చేస్తున్నారు. బాధితులను ఇబ్బందిపెడుతున్నారు. బ్యాంక్ దొంగలకే పోలీసులను పెట్టి రక్షణ కల్పిస్తున్నారు. ఖాతాదారులకు, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని గాదె వెంకటేశ్వరరావు అన్నారు.