మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తిలో అన్నదానం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మంగళవారం శ్రీకాళహస్తి పట్టణ చిరంజీవి అభిమానులు తోట గణేష్, పేటా చంద్ర, పేటా చిరంజీవిల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వందలమంది పేద వారికి అన్నదానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ వేణు గోపాల్, రవీ, చైత్, కిషోర్, గురవయ్య, ఫాహద్, జనసైనికులు మునిశేఖర్ రెడ్డి తులసి, గోపి, టాగూర్ తదితరులు పాల్గొన్నారు.