అడ్డతీగలలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు

రంపచోడవరం నియోజకవర్గం: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అడ్డతీగల గ్రామంలో ప్రత్యేక అవసరాలగల పిల్లల వనరుల కేంద్రం చిన్నారులతో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. మరియు కృప అనాధాశ్రమం దగ్గర కేక్ కటింగ్ చేయడం జరిగింది జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఫ్రూట్స్, బిస్కెట్స్, రొట్టెలు చిన్నారులకు, పెద్దలకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుప్పాల జయరాం, చోళ్ళ కృష్ణారెడ్డి, పొడుగు సాయి, బాబి, అప్పాజీ, వెంకన్న, స్వామి తదితరులు పాల్గొన్నారు.