రాజంపేట అసెంబ్లీ సర్వసభ్య సమావేశం

రాజంపేట పట్టణంలోని ఏ.బి.చంద్రరెడ్డి గార్డెన్స్ లో రాజంపేట పార్లమెంటు అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మరియు అసేంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన రాజంపేట అసేంబ్లీ సర్వసభ్య సమవేశంలో ముఖ్య అతిధిగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అతికారి దినేష్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించిన కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంటు పోటి చెయ్యడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రాష్టంలొ ఉన్న 25 పార్లమెంటు కేంద్రలలో రాజంపేట అభివృద్ధికి నోచుకోలేదని, రాజంపేటలోని మార్కెట్ యార్డ్ డంప్ యార్డ్ లా ఉందని, ఇక్కడ రోడ్లు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయని, ఇక్కడ ఉన్న వైసిపి నాయకులు ప్రజల డబ్బు దోచుకోవడం తప్ప రాజంపేటను పట్టించుకోలేదని, ఈ ప్రాంత అభివృద్ధి పసుపులేటి బ్రహ్మయ్య హయాం తరువాత చేసినవారు ఎవరు లేరని తెలియజేశారు. సిఎం జగన్ రెడ్డి కడప నా ప్రాంతం అని చెప్పుకుంటాడు కాని నందలూరులోని రైల్వే లోకోషేడ్ స్థానంలో ప్రత్యామ్నాయ పరిశ్రమ తీసుకరాలేక పోయారు. అలానే నందలూరులోని ఆల్విన్ పరిశ్రమ, రైల్వే కోడురులో అప్ప జ్యూస్ పరిశ్రమలను గాలికి వదిలేశాడు, కడపలోని ఉక్కు పరిశ్రమకు మూడు సార్లు శంకుస్థాపన తప్ప ఇంకేమి చెయ్యలేదు అని వైసిపి పాలనపై ఘాటుగా స్పందించారు. వచ్చే ఎన్నికలలో రాజంపేట పార్లమెంటు, అసేంబ్లీ స్థానాలను కూటమి గెలుచుకుంటుందని దీనికి రాజంపేట పార్లమెంటులోని 7 నియోజకవర్గాలలో జనసేన పార్టీ చాలా బలంగా పనిచేస్తుంది అని జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన-బిజేపి-టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.